NTR- Jio Studios: ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ఊహించని స్థాయికి చేరింది. ముఖ్యంగా బాలీవుడ్ మేకర్స్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. నార్త్ ఇండియా భారీ ప్రాజెక్ట్స్ కి ఎన్టీఆర్ బెస్ట్ ఛాయిస్ అయ్యారు. నార్త్ తో పాటు సౌత్ మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలని ఎన్టీఆర్ వెనుకబడుతున్నారు. క్రేజీ సీక్వెల్ వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఈ భారీ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన రానుంది.
అయితే ఎన్టీఆర్ మరో బాలీవుడ్ చిత్రం చేయాల్సి ఉంది. ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్య ధార్ ‘ది ఇమ్మోర్టల్ అశ్వద్దామ’ టైటిల్ తో పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. ఈ చిత్ర హీరోగా మొదట విక్కీ కౌశల్ అనుకున్నారు. అయితే భారీ బడ్జెట్ మూవీ కావడంతో మార్కెట్ అండ్ ఫేమ్ ఉన్న హీరోలను తీసుకోవడం బెటర్ ని ఆలోచన మార్చుకున్నారు. రణ్వీర్ సింగ్, ఎన్టీఆర్ లతో ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ చేయాలని భావించారు.
ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపారట. అయితే తన క్యారెక్టర్ విషయంలో సంతృప్తి చెందని ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట. ఎన్టీఆర్ నిర్ణయం జియో స్టూడియోస్ కి భారీ నష్టం తెచ్చిందన్న ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్ నిష్క్రమణతో ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ ప్రాజెక్ట్ మీద మేకర్స్ ఆశలు వదులుకున్నారట. జియో స్టూడియోస్ ఆల్రెడీ రూ. 30 కోట్ల వరకు ప్రీ ప్రొడక్షన్ కోసం ఖర్చు చేశారట. ఈ ప్రాజెక్ట్ ఇంతటితో ఆపేస్తే మంచిదని జియో స్టూడియోస్ భావిస్తోందట. ఎన్టీఆర్ నో చెప్పడం కారణంగా జియో స్టూడియోస్ చేపట్టిన రూ. 500 కోట్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందట.
కాగా జియో ప్రాజెక్ట్ ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టడానికి అసలు కారణం బడ్జెట్ అంటున్నారు. ఇప్పటి వరకు అయిన ఖర్చు, భవిష్యత్ లో చేయాల్సిన ఖర్చు పరిగణలోనికి తీసుకుని ప్రాజెక్ట్ ఆపేయడమే మంచిదన్న భావనకు వచ్చారట దర్శకుడు ఆదిత్య ధార్ డ్రీమ్ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయిన నేపథ్యంలో ఆయన నిరాశ చెందుతున్నారట. గతంలో కూడా బాలీవుడ్ మేకర్స్ ఘనంగా ప్రకటించిన పలు హిందీ చిత్రాలు కార్యరూపం దాల్చలేదు.