https://oktelugu.com/

Agent Movie Collections: ఏజెంట్’ 4 రోజుల వసూళ్లు.. అన్నీ ప్రాంతాలలో జీరో షేర్స్

80 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ సినిమాని తీస్తే మొదటి రోజు వచ్చిన వసూళ్లు కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే. శనివారం మరియు ఆదివారం అయినా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటుంది అని భావిస్తే ఆ రెండు రోజులు ఇంకా దారుణంగా వసూలు చేసింది.

Written By:
  • Vicky
  • , Updated On : May 2, 2023 / 01:32 PM IST
    Follow us on

    Agent Movie Collections: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి నుండి ఇంత చెత్త సినిమా ఇప్పటి వరకు చూడలేదని, అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆయనే అంటే నమ్మలేకపోతున్నామని సినిమాని చూసిన ప్రతీ ఒక్కరూ చెప్పిన మాట. అందుకే ఈ చిత్రానికి మొదటి రోజు నుండి ఓపెనింగ్స్ కూడా లేవు.

    80 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి ఈ సినిమాని తీస్తే మొదటి రోజు వచ్చిన వసూళ్లు కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ మాత్రమే. శనివారం మరియు ఆదివారం అయినా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటుంది అని భావిస్తే ఆ రెండు రోజులు ఇంకా దారుణంగా వసూలు చేసింది. మొత్తం మీద నాలుగు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రాంతాల వారీగా ఎంత రాబట్టిందో ఒకసారి చూద్దాము.

    ముందుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను ఇచ్చే ప్రాంతం నైజాం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాంతం లో మొదటి నాలుగు రోజులకు కలిపి కేవలం కోటి 64 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసింది. ఇలాంటి యాక్షన్ సినిమాలకు మొదటి రోజే ఈ ప్రాంతం లో 5 కోట్ల రూపాయిల వరకు షేర్ వస్తుంది. కానీ ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి అందులో సగం వసూళ్లు కూడా రాకపోవడం విశేషం.

    ఇక ఆ తర్వాత సీడెడ్ లో 81 లక్షలు, ఉత్తరాంధ్ర లో 78 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 44 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 39 లక్షలు, గుంటూరు లో 66 లక్షలు , కృష్ణ జిల్లాలో 33 లక్షలు , నెల్లూరు లో 22 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల 27 లక్షలు రాగ, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.ఈ చిత్రం ప్రస్తుతం కమిషన్ బేసిస్ మీదనే నడుస్తుంది, రెంటల్ బేసిస్ మీద నడుస్తున్న థియేటర్స్ లో జీరో షేర్స్ వస్తున్నాయి.