Ponniyin Selvan 2 Collections: నాలుగు రోజుల్లో 200 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘

ముఖ్యంగా నార్త్ ఇండియా లో ఈ చిత్రానికి 6 మిలియన్ డాలర్స్ వచ్చాయి. సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన 'రోబో 2' తర్వాత ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన తమిళ చిత్రం ఇదే. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం 'పొన్నియన్ సెల్వన్ 2 ' ఈమధ్యనే విడుదల అయ్యింది. మొదటి భాగం తో పోలిస్తే చాలా తక్కువ అంచనాల నడుమ విడుదలైంది ఈ చిత్రం.

Written By: Vicky, Updated On : May 2, 2023 1:46 pm
Follow us on

Ponniyin Selvan 2 Collections: మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, తన డ్రీం ప్రాజెక్ట్ గా చేసిన చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ఈ కథని రెండు భాగాలుగా విభజించి మొదటి భాగం ని గత ఏడాది విడుదల చెయ్యగా సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి ఆ చిత్రం 500 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్ వసూళ్లు వచ్చాయి.

ముఖ్యంగా నార్త్ ఇండియా లో ఈ చిత్రానికి 6 మిలియన్ డాలర్స్ వచ్చాయి. సూపర్ స్టార్ రజినికాంత్ నటించిన ‘రోబో 2’ తర్వాత ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన తమిళ చిత్రం ఇదే. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం ‘పొన్నియన్ సెల్వన్ 2 ‘ ఈమధ్యనే విడుదల అయ్యింది. మొదటి భాగం తో పోలిస్తే చాలా తక్కువ అంచనాల నడుమ విడుదలైంది ఈ చిత్రం.

ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో అయితే రాలేదు కానీ, రీసెంట్ గా విడుదలైన తమిళ సినిమాలలో ది బెస్ట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. కేవలం తమిళ వెర్షన్ కి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. టాక్ చాలా పాజిటివ్ గా రావడం తో రెండవ రోజు నుండి కూడా మంచి వసూళ్లు వచ్చాయి.

అలా నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలు మరియు అన్నీ భాషలకు కలిపి 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు రావడం తో ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఈ చిత్రం ఆ రేంజ్ వసూళ్లను రాబడుతుందో లేదో అనేది.