Khushboo’s Daughter : తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా ఈమె అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. 90 స్ లో అగ్ర హీరోయిన్లలో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ ఖుష్బూ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన స్టార్ హీరోయిన్లలో హీరోయిన్ ఖుష్బూ కూడా ఒకరు. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుగుంది. ఈమె అందానికి నటనకు ఫిదా కాని వారు అంటూ ఎవరు ఉండరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కుష్బూ తెలుగుతోపాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషలలో కూడా అనేక సూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఉంది. విక్టరీ వెంకటేష్ కు జోడిగా కలియుగ పాండవులు అనే సినిమాతో కుష్బూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈమె ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క రాజకీయాలలో కూడా చాలా యాక్టివ్ గా ఉంది. ఈమెకు తెలుగుతోపాటు తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. తమిళ నాట ఈమెకు అభిమానులు గుడి కూడా కట్టి ఆరాధిస్తున్నారు.
Also Read : హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బ్యూటీ.. చాలాకాలం గ్యాప్ తర్వాత
ప్రస్తుతం కుష్బూ భారతీయ జనతా పార్టీలో ఆక్టివ్ మెంబర్గా కొనసాగుతున్నారు. ఇటీవల ఈమె సినిమాలను తగ్గించారు. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. కుష్బూ 2021లో రజనీకాంత్ నటించిన అన్నాత్తేలో నటించారు. ఈ సినిమాతోపాటు తెలుగులో కూడా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి అలాగే హీరో శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలలో కుశుబు నటించారు.
ఈ సీనియర్ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. సమాజంలో జరిగే విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కుష్బూ కూతురికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ కుష్బూ తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్ ను పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఒక కూతురి పేరు అవంతిక. అవంతిక ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటుంది. అవంతిక అందంలో తల్లికి మించి ఉంటుంది. ప్రస్తుతం అవంతిక లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజెన్స్ ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.
View this post on Instagram