https://oktelugu.com/

Star Heroine: ప్రభాస్ తో నటించాలంటే ఆయన నా ఇంటికి… స్టార్ హీరోయిన్ క్రేజీ కామెంట్స్

Star Heroine: హాలీవుడ్ రేంజ్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాహో రూపొందించారు. అంచనాల మధ్య 2019లో విడుదలైన సాహో ఆశించిన స్థాయిలో ఆడలేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 3, 2024 / 01:45 PM IST

    Star heroine crazy comments on Prabhas

    Follow us on

    Star Heroine: ప్రభాస్(Prabhas) పక్కన నటించాలంటే ఓ షాకింగ్ కండిషన్ పెట్టింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధ కపూర్(Shraddha Kapoor). ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె క్రేజీ కామెంట్స్ చేసింది. ప్రభాస్-శ్రద్ధ కపూర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం సాహో(Saaho). దర్శకుడు సుజిత్ తెరకెక్కించాడు. హాలీవుడ్ రేంజ్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా సాహో రూపొందించారు. అంచనాల మధ్య 2019లో విడుదలైన సాహో ఆశించిన స్థాయిలో ఆడలేదు. తెలుగు ఆడియన్స్ కి సాహూ అంతగా ఎక్కలేదు.

    కానీ హిందీలో సాహో విజయం సాధించింది. సాహో హిందీ వెర్షన్ రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాహో ఫలితం నేపథ్యంలో శ్రద్ధ కపూర్ కి తెలుగులో ఆఫర్స్ రాలేదు. అదే సమయంలో ఆమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగా అడుగుతుంది. ఈ కారణాలతో శ్రద్ధ కపూర్ మరలా తెలుగులో కనిపించలేదు. తాజాగా శ్రద్ధ కపూర్ ఆన్లైన్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ అభిమాని… ప్రభాస్ తో మరలా ఎప్పుడు నటిస్తారు? అని అడిగాడు.

    Also Read: Bharateeyudu 2: భారతీయుడు 2 లో కమలహాసన్ సిద్ధార్థ్ ఇద్దరిలో హీరో ఎవరు..?

    ఈ ప్రశ్నకు స్పందనగా శ్రద్ధ కపూర్… నేను ప్రభాస్ తో మళ్ళీ నటించాలంటే ఆయన నాకు తన ఇంటి భోజనం పంపాలి, అప్పుడు మాత్రమే నటిస్తాను అని కామెంట్ చేసింది. శ్రద్ధ కపూర్ సమాధానం వెనుక పెద్ద కథే ఉంది. ప్రభాస్ ఒక ట్రెడిషన్ ఫాలో అవుతాడు. తనతో నటించే హీరోయిన్స్ కి అరుదైన వంటకాలతో భారీ విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. షూటింగ్ ముగిసే లోపు ఏదో ఒకరోజు ప్రభాస్ తన చెఫ్ టీమ్ తో రుచికరమైన వంటకాలు చేయించి ఆతిథ్యం ఇస్తాడు.

    Also Read: Rajamouli-Mahesh Babu: రాజమౌళి మహేష్ బాబు సినిమా విషయం లో ఏం జరుగుతుంది…

    శ్రద్ధ కపూర్, పూజా హెగ్డే, కరీనా కపూర్, కృతి సనన్… ఇలాంటి ఆతిధ్యాన్ని ఆస్వాదించినవారే. సాహో సెట్స్ లో ప్రభాస్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ భారీ భోజన విందు ఏర్పాటు చేశాడు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న శ్రద్ధ కపూర్… ఆయన ఇంటి భోజనం ఒకసారి ఆస్వాదించాలని ఉందన్న కోరిక బయటపెట్టింది. ప్రభాస్ కొందరు సభ్యులతో కూడిన చెఫ్ టీమ్ ని మైంటైన్ చేస్తారట. ఆ టీమ్ ప్రభాస్ కోరుకునే పలు రకాల వంటలను స్వయంగా చేసి అందిస్తారు. ప్రభాస్ భోజన ప్రియుడన్న సంగతి తెలిసిందే.