Komatireddy Venkat Reddy: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. నిన్నటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ తో ఏపీకి సంబంధాలు తెగిపోయాయి. పదేళ్ల గడువు ముగియడంతో హైదరాబాద్ పై ఏపీకి ఎటువంటి హక్కులు ఉండవు.అయితేనేతల మధ్య మాత్రం మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగుతుండడం విశేషం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) చంద్రబాబుకు(Chandrababu) అత్యంత సన్నిహితుడు. మొన్నటి వరకు జగన్ కు సన్నిహితంగా ఉండే కెసిఆర్ అధికారానికి దూరమయ్యారు. అదే సమయంలో జగన్ కు కాంగ్రెస్ ప్రభుత్వంలో సన్నిహితులుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్(Komatireddy Venkat Reddy) లాంటి వారు ఉన్నారు.
బిఆర్ఎస్ లో ఉండే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy).. తాడేపల్లి వచ్చి జగన్ తో సమావేశమయ్యారు. అక్కడి నుంచి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఏపీలో గత ఐదు సంవత్సరాలుగా చాలా విషయాల్లో ఈయనకు చెందిన సంస్థలు కాంట్రాక్టులు పొందాయి. జగన్ కు బినామీ అని కూడా బొంగులేటిని అనుమానిస్తుంటారు. అయితే పొంగులేటి ఏపీ ఎన్నికల్లో ఫండింగ్ చేశారన్నది ఒక ఆరోపణ. కృష్ణాజిల్లాలో వైసీపీ అభ్యర్థుల తరఫున ఖర్చును పొంగులేటి భరించారన్నది ఆరోపణ కాదు.. వాస్తవం అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. పెద్ద ఎత్తున జగన్ ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన పొంగులేటి ఫండింగ్ చేశారన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ.
Also Read: YCP: కౌంటింగ్ ఏజెంట్ల కోసమే వైసిపి ఆ ప్రచారం
ఒకానొక దశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిజెపిలో చేరతారని ప్రచారం జరిగింది. ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అటు వెళ్లిపోయారు కూడా. కానీ అక్కడ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. దీంతో వెంకటరెడ్డి ఇక్కడే ఉండిపోయారు. రేవంత్ రెడ్డి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు నింపారు. అధికారంలోకి తీసుకు రాగలిగారు. అయితే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డిని.. ఏపీ రాజకీయాల ద్వారా పక్కకు తప్పించాలని చూస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పొంగులేటి, కోమటిరెడ్డి పెద్ద ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో జగన్ ను నిలబెట్టి.. తెలంగాణలో రేవంత్ ను కొట్టాలన్నది వారి ప్లాన్ గా టాక్ నడుస్తోంది.
Also Read: Balakrishna : బాలయ్యకు ఆ వ్యసనం ఉంది… సొంత అల్లుడు బయటపెట్టిన చేదు నిజం!
ఏపీలో జగన్ గెలవాలని కెసిఆర్ భావిస్తున్నారు. అప్పుడే తెలంగాణాలో తాము కోలుకోగలమని అంచనా వేస్తున్నారు. ఏపీలో గెలిచేది జగన్ అని చెబుతున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి కూడా ధ్రువీకరిస్తున్నారు. ఏపీలో తన స్నేహితుల ద్వారా తెలిసిందని.. అక్కడ గెలిచేది జగన్ అని ఇటీవల ఆయన ప్రకటించారు. అక్కడ స్నేహితులు వైసీపీ నేతలే. అటు కెసిఆర్ కు, కేటీఆర్ కు స్నేహితులు వారే. అంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇటు బిఆర్ఎస్, అటు కాంగ్రెస్ నేతలకు తెలిసిందన్నమాట. అంటే అక్కడే ఎన్నెన్నో అనుమానాలు బలపడుతున్నాయి. కెసిఆర్, కేటీఆర్ మాట్లాడాలంటే ఒక అర్థం ఉంది. వారికి చంద్రబాబు అంటే పడదు. జగన్ తో ట్రావెల్ చేశారు. కానీ కోమటిరెడ్డి, పొంగులేటి వ్యవహారం చూస్తుంటే రేవంత్ పై ప్లాన్ కే అన్నట్టు ఉంది పరిస్థితి.