What will happen in Rajamouli Mahesh Babu movie
Rajamouli-Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడి గా పేరు గాంచిన రాజమౌళి(Rajamouli) పాన్ ఇండియాలో బాహుబలి సినిమాతో ఒక ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తూ వరల్డ్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటరవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుని(Mahesh Babu) హీరోగా పెట్టి ఆయన చేస్తున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక పాన్ వరల్డ్ రేంజ్ లో వెయ్యి కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించి హాలీవుడ్ మేకర్స్ కంటే మనమేమి తక్కువ కాదు అని నిరూపించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నాలతో ఆయన ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అవుతున్నప్పటికీ ఇంకా ఇప్పటికీ వరకైతే కూడా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్టెప్పు కూడా ముందుకు పడడం లేదు.
Also Read: NTR-Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడంటే..?
అయితే ఇప్పటికే రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని ఫినిష్ చేసి పెట్టినప్పటికీ ఆర్టిస్టులను ఎంచుకోవడంలో గాని, సినిమా షూటింగ్ ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుంది అనే విషయంలో కానీ ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. మరి ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎందుకింత లేట్ చేస్తున్నాడు అనే విషయం మీద ఎవరికి సరైన అవగాహన అయితే లేదు. మరి ఈ సినిమా సెట్స్ మీదకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయం మీద అభిమానులు విపరీతమైన కామెంట్లైతే చేస్తున్నారు.
Also Read: Legendary Heroes: ఇద్దరు లెజెండరీ హీరోలతో ఫొటో దిగిన ఈ బుడ్డోడు ఎవరో తెలుసా..?
ఇక మొత్తానికైతే అటు మహేష్ బాబు, ఇటు రాజమౌళి ఇద్దరు భారీ సక్సెస్ ని సాధించి పాన్ వరల్డ్ లో వాళ్ల పేర్లను చిరస్మరణీయంగా నిలుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి కూడా ప్రపంచ స్థాయి కి చేరుకుంటుంది…