https://oktelugu.com/

Alia Bhatt And Ranbir Kapoor: ‘అలియా భట్’తో పెళ్లి పై స్టార్ హీరో రియాక్షన్

Alia Bhatt And Ranbir Kapoor: బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. దాంతో గత మూడేళ్ల నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ బంధాన్ని మరో మెట్టు పైకెక్కించాలని ఈ లవ్‌ బర్డ్స్ భావిస్తున్నట్లు ప్రస్తుతం బాలీవుడ్‌ లో బాగా హాట్ టాపిక్ అయ్యింది. గత కొన్ని రోజులుగా వీరి వివాహం గురించి మీడియా, […]

Written By:
  • Shiva
  • , Updated On : March 31, 2022 / 11:47 AM IST
    Follow us on

    Alia Bhatt And Ranbir Kapoor: బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. దాంతో గత మూడేళ్ల నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ బంధాన్ని మరో మెట్టు పైకెక్కించాలని ఈ లవ్‌ బర్డ్స్ భావిస్తున్నట్లు ప్రస్తుతం బాలీవుడ్‌ లో బాగా హాట్ టాపిక్ అయ్యింది.

    Alia Bhatt And Ranbir Kapoor

    గత కొన్ని రోజులుగా వీరి వివాహం గురించి మీడియా, సోషల్‌ మీడియాలో బోలెడన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఈ క్రేజీ కపుల్స్‌ పెళ్లి పీటలు ఎప్పుడు ఎక్కుతారా వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. రణ్‌బీర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి అయితే.. మా పెళ్లి తేది ఇది అని చెప్పలేను. కాకపోతే.. నాకూ, అలియాకి పెళ్లి చేసుకోవాలని ఉంది. త్వరలోనే మా పెళ్లి జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం’ అని రణబీర్ కపూర్ కామెంట్స్ చేశాడు.

    Also Read: Soundarya Rejected Ali: అలీ పక్కన చేయబోనని రిజెక్ట్ చేసిన సౌందర్య.. కట్ చేస్తే ఆమెనే ఛాన్స్ కోసం రిక్వెస్ట్..

    అయితే, ఏప్రిల్‌లోనే వీరిద్దరూ పెళ్లితో ఒక్కటవుతున్నారని ఊహాగానాలు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. ఇక ఈ పుకార్లపై రణబీర్ ఆంటీ రిమా జైన్ మాట్లాడుతూ.. ‘వాళ్ళ పెళ్లి గురించి నాకేం తెలియదు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అని మాత్రం తెలుసు. అది ఎప్పుడు అనేది వాళ్లే చెప్పాలి. త్వరలోనే వారు ఓ నిర్ణయానికి వస్తారు అని, సడెన్‌ గా తమ పెళ్లి గురించి అందరికీ చెబుతారు’ అని నేను కూడా అనుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది.

    అయితే, అసలు ఇప్పుడు ఉన్నట్టు ఉండి వీరి పెళ్లి పుకార్లు రావడానికి ముఖ్య కారణం.. సెలబ్రెటీ డిజైనర్ మనీశ్ మల్హోత్రాతో రణ్ బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ కనిపించింది. మనీశ్‌ను పెళ్లి దుస్తుల డిజైన్ కోసమే నీతూ కలసిందని అంటున్నారు. మరోపక్క అలియా – రణబీర్ కపూర్ పెళ్లి వార్తలు చదివి చదివి ప్రేక్షకులు కూడా బాగా నీరసించి పోయారు.

    Alia Bhatt And Ranbir Kapoor

    చాలాకాలంగా ఇవే వార్తలు రాస్తున్నారు అంటూ నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడ్డారు. అయితే, ఈ మధ్య ఈ జంట నిజంగానే తమ పెళ్లి గురించి ఆలోచిస్తోంది. అందుకే.. వీరి పెళ్లికి సంబంధించిన వార్తల పై ప్రేక్షకుల్లో మళ్ళీ ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా “మా నాన్న గారు జీవించే ఉండి ఉంటే.. మేం ఈపాటికే పెళ్లి చేసుకుని ఒక్కటి అయ్యేవాళ్లం’ అని రణబీర్ కపూర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు.
    ఇక అప్పటి నుంచి వీరి పెళ్లికి సమయం దగ్గర పడిందనే వార్త బాగా వైరల్ అయింది.

    Also Read: AR Rahaman: ఏఆర్ రెహమాన్ సంగీతం చేయడు.. అవన్నీ వేరే వాళ్ల ట్యూన్స్?

    Tags