SS Rajamouli Personal Life: దర్శక ధీరుడు రాజమౌళి అంటే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. అపజయం అంటూ ఎరుగని డైరెక్టర్. తీసిన ప్రతి సినిమాతో తన రికార్డులను తానే కొల్లగొడుతాడు. ఆయన రికార్డులను కొల్లగొట్టడం అంటే ఎవరికీ సాధ్యం కాదు. అందుకే తన పాత సినిమాల రికార్డులను తానే తిరగరాస్తుంటాడు. ఆయన సినిమా విడుదలవుతుందంటే సినీ ప్రపంచం మొత్తం అటే చూస్తుంది.
ఆయన సినిమా హోరుకు ఏ హీరో మూవీ కూడా నిలబడలేదు. టాలీవుడ్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన డైరెక్టర్ ఆయన. అయితే రాజమౌళి గురించి ఎలాంటి వార్త అయినా చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మరి ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి.. వారి ఆస్తులేంటి అనే విషయాలను రాజమౌళి తల్లి రాజనందిని స్నేహితురాలు అయిన పాపయమ్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
Also Read: Alia Bhatt And Ranbir Kapoor: ‘అలియా భట్’తో పెళ్లి పై స్టార్ హీరో రియాక్షన్
రాజమౌళిది పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు. వారి తాత అయిన అప్పారావు అంటే అప్పట్లో పెద్ద జమిందారి. ఆయనకు ఐదుగురు కొడుకులు. అందులో విజయేంద్ర ప్రసాద్ ఒక్కరు. వారికి దాదాపు 600 ఎకరాల ఆస్తి ఉండేదంట. అప్పట్లోనే వారు అప్పారావు పేరు మీద కెమికల్ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేశారంటే.. ఎంత సంపన్నులో అర్థం చేసుకోవచ్చు.
గోదావరి జిల్లాల్లో కోడూరి కుటుంబం అంటే తెలియని వారుండరు. అంత పెద్ద జమిందారి కుటుంబం. అయితే రాజమౌళి తాత అప్పారావు చనిపోయిన తర్వాత.. కొడుకులెవరికీ ఆయన ఆస్తుల గురించి తెలియదంట. అందరూ చదువుకోవడంలో బిజీగా ఉండటంతో ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా పెద్దగా తెలియక చాలా వరకు పోగొట్టుకున్నారని పాపాయమ్మ చెప్పుకొచ్చింది.
తమ వంతుగా వచ్చిన కొద్ది పాటి ఆస్తిని విజయేంద్ర ప్రసాద్ తన కొడుకు రాజమౌళి పేరు మీద రిజిస్టర్ చేయించారట. కానీ తాత ఆస్తిని పోగొట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయి అంతకు పదింతలు సంపాదించాడు. విధిరాత అంటే ఇదేనేమో మరి. పోగొట్టుకున్న కొవ్వూరు లోనే సినిమా షూటింగులు చేస్తూ.. ఇప్పుడు వందల కోట్లకు అధిపతి అయ్యాడు రాజమౌళి.
Also Read: Puneeth Rajkumar: పునీత్ హీరోగా నిలదొక్కుకోవడానికి తెలుగు సినిమాలే కారణం.. అవేంటో తెలుసా..?