Hanuman: హిందువులు ఎంత పవిత్రంగా పూజించే దేవుళ్లలో ఆంజనేయస్వామి కూడా ఒకరు. ఆంజనేయ స్వామి ఆలయం లేని గ్రామం అంటూ అసలు ఉండదు. ఇలా ప్రతి గ్రామంలోనూ స్వామివారు కొలువై ఉండి భక్తుల చేత విశేషమైన పూజలు అందుకుంటారు. ఇకపోతే ఆంజనేయస్వామి ఎంతో బలశాలి, ధైర్యవంతుడు అనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఆంజనేయస్వామి తొమ్మిది రూపాయలు కలిగి ఉన్నారు. ఇందులో ఐదవ రూపమే పంచముఖ రూపం.ఈ విధంగా పంచముఖ రూపంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని పూజించడం ఎంతో శుభం అని పండితులు చెబుతుంటారు. మరి పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించే టప్పుడు ఎలా పూజించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
Also Read: AP Cabinet Expansion: ముంచుకొస్తున్న ఏప్రిల్ గండం.. వైసీపికి కౌంట్ డౌన్ ప్రారంభం
పంచముఖ ఆంజనేయ స్వామి మంగళవారం సింధూరంతో పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు పువ్వుల నుంచి పండ్ల వరకు ప్రతిదీ ఐదు రకాల వస్తువులతో పూజ చేయటం మంచిది. ఇక మంగళవారం స్వామివారికి పూజ చేసేటప్పుడు ఐదు అరటి పండ్లను స్వామికి సమర్పించి పూజ చేయాలి. అలాగే స్వామి వారి ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి.ముఖ్యంగా సింధూరంతో మంగళవారం స్వామివారిని పూజించడం వల్ల ఎలాంటి పనులు అయినా సక్రమంగా జరుగుతాయి.
కేవలం ఫలాలు పుష్పాలు మాత్రమే కాకుండా మంగళవారం స్వామివారికి పెట్టే నైవేద్యం కూడా ఐదు రకాల ఆహారపదార్థాలను కలిగి ఉండటం మంచిది. అయితే స్వామి వారికి ఎంతో ఇష్టమైన జిల్లేడు, తమలపాకులు, మారేడు, ఉత్తరేణి, గరిక వంటి ఆకులతో పూజించాలి. అదేవిధంగా మల్లె, మందార, నందివర్ధనం, కనకాంబరం, పారిజాత పుష్పాలతో పూజించాలి. మనం ఆంజనేయ స్వామిని పూజించే సమయంలో శ్రీరాముడిని కూడా పూజించడంవల్ల ఆంజనేయస్వామి ఎంతో సంతోషించి ఆయన అనుగ్రహం మనపై ఉండేలా కలిగిస్తారు. ఎందుకంటే ఆంజనేయుడు శ్రీరామ భక్తుడు కనుక శ్రీరాముడిని పూజిస్తే హనుమంతుని ఆశీస్సులు కూడా మన పై ఉంటాయి.
Also Read: Puneeth Rajkumar: పునీత్ హీరోగా నిలదొక్కుకోవడానికి తెలుగు సినిమాలే కారణం.. అవేంటో తెలుసా..?