Allu Arjun: 2020లో అల వైకుంఠపురంలో చిత్రంతో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఖాతాల్లో వేసుకున్నాడు అల్లు అర్జున్. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. నయా రికార్డ్స్ నమోదు చేసింది. అనంతరం దాదాపు రెండేళ్లకు పుష్ప చేశాడు. 2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప అల్లు అర్జున్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అల్లు అర్జున్ ఇమేజ్ పూర్తిగా మార్చేసిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.
నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. పుష్ప చిత్రానికి సీక్వెల్ గా పుష్ప 2 చేస్తున్నారు. ఈ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 300 కోట్లు. దర్శకుడు సుకుమార్ భారీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ విడుదల ఆలస్యమైంది. ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా డిసెంబర్ 6కి పోస్ట్ ఫోన్ అయ్యింది. ఈసారి చెప్పిన సమయానికి రావాలని అల్లు అర్జున్ గట్టిగా కష్టపడుతున్నాడు.
కాగా పుష్ప 2 అనంతరం అల్లు అర్జున్ చేసే ప్రాజెక్ట్స్ పై సందిగ్ధత నెలకొంది. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ లతో అల్లు అర్జున్ చిత్రాలు చేస్తున్నాడనే వాదన ఉంది. త్రివిక్రమ్ తో అయితే మూవీ కన్ఫర్మ్. అయితే కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో అల్లు అర్జున్ మూవీ చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు దాదాపు ఖాయమైనట్లు వార్తలు వచ్చాయి. సమంత హీరోయిన్ అంటూ కథనాలు రాసుకొచ్చారు. మరలా ఆమె కాదని మరొక హీరోయిన్ ని తీసుకున్నారని కూడా వార్తలొచ్చాయి.
తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్-అట్లీ మూవీ క్యాన్సిల్ అయ్యిందట. అల్లు అర్జున్ కి హ్యాండ్ ఇచ్చిన అట్లీ మరొక స్టార్ హీరో తో కమిట్ అయ్యాడట. అట్లీ గత చిత్రం జవాన్ భారీ విజయం అందుకుంది. షారుక్ ఖాన్ నటించిన జవాన్ రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో అట్లీకి డిమాండ్ పెరిగింది. సల్మాన్ ఖాన్ తో అట్లీ మూవీ చేసేందుకు సిద్దమయ్యాడని లేటెస్ట్ టాక్. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు. పుష్ప 2 పై మాత్రం అంచనాలు భారీగా ఉన్నాయి.