https://oktelugu.com/

Vikram: ప్రభాస్ ని టాలీవుడ్ హీరో అనడం కరెక్ట్ కాదు అంటూ హీరో విక్రమ్ సెన్సేషనల్ కామెంట్స్!

ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన కల్కి చిత్రం తో వెయ్యి కోట్ల రూపాయిలను కొల్లగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతున్న సమయంలోనే ఆయన 'రాజా సాబ్' గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు.

Written By:
  • Vicky
  • , Updated On : August 28, 2024 / 12:57 PM IST

    Vikram

    Follow us on

    Vikram: ఒకపక్క బాలీవుడ్ నటులు ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని చూసి కుళ్ళతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే, మరోపక్క తమిళ నటులు మాత్రం ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. విక్రమ్ లాంటి నటుడు రీసెంట్ గా ప్రభాస్ గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్. ఆయనని కేవలం టాలీవుడ్ హీరో అనడం కరెక్ట్ కాదు..ఆయన ఇప్పుడు అన్ని భాషలకు సంబంధించిన వాడు, ఆయన సినిమాల కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. విక్రమ్ లాంటి పాపులర్ స్టార్ ఎలాంటి ఈగో లేకుండా ప్రభాస్ గురించి ఇంత గొప్పగా మాట్లాడితే, అసలు ఇండస్ట్రీ లో ఉన్నాడో, లేదో కూడా తెలియనంత పాపులారిటీ ఉన్న అర్షద్ లాంటి అల్పుల కామెంట్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ అభిమానులు అంటున్నారు.

    ఇది ఇలా ఉండగా రీసెంట్ గా విక్రమ్ నటించిన ‘తంగలాన్’ అనే చిత్రం విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లతో ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో భాగంగా, విక్రమ్ మరియు మాళవిక మోహనన్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ ప్రభాస్ గురించి పై విధంగా మాట్లాడాడు విక్రమ్. మాళవిక మోహనన్ ప్రభాస్ తో కలిసి ప్రస్తుతం ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి పనిచేసిన అనుభూతిని మాళవిక మోహనన్ పంచుకుంటూ ‘ప్రభాస్ తో కలిసి పనిచేయడం నా అదృష్టం గా భావిస్తున్నాను. అంత పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి కూడా, మాతో సెట్స్ లో చాలా స్నేహంగా ఉండేవారు. భాష పరంగా సినిమా సరిహద్దులను చెరిపేసిన సూపర్ స్టార్ ఆయన. ప్రభాస్ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు చూపించే అమితాసక్తిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. చాలామంది ‘రాజా సాబ్’ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమానా అని అడుగుతున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ ఉన్న చిత్రం, పాన్ ఇండియా కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

    ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన కల్కి చిత్రం తో వెయ్యి కోట్ల రూపాయిలను కొల్లగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం థియేటర్స్ లో రన్ అవుతున్న సమయంలోనే ఆయన ‘రాజా సాబ్’ గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ వంగ తో ‘స్పిరిట్’, హను రాఘవపూడి తో ఒక సినిమా, కల్కి 2 , సలార్ 2 చిత్రాలు చేస్తున్నాడు. వీటిల్లో ‘రాజా సాబ్’ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది, త్వరలోనే హను తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.