https://oktelugu.com/

Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు రాజమౌళి సినిమాలో నటించనున్న స్టార్ క్రికెటర్లు…

Mahesh Babu-Rajamouli: డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాతో ఏకంగా 3000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టాలని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : June 4, 2024 / 05:28 PM IST

    Star cricketers to act in Mahesh Babu Rajamouli movie

    Follow us on

    Mahesh Babu-Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు మహేష్ బాబు ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన పాన్ ఇండియాలో ఒక సినిమా కూడా చేయలేదు.

    అలాంటిది డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఈ సినిమాతో ఏకంగా 3000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టాలని అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఇద్దరు టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఈ సినిమాని మార్కెట్ పరంగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ఇండియాలో ఉన్న స్టార్ యాక్టర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    Also Read: Kalki Movie: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా..?

    ఇక దాంతో పాటుగా ఈ సినిమాలో ఒక్క సీన్ లో ఆస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్ ఆయిన డేవిడ్ వార్నర్(David Warner), అలాగే ఇండియన్ టీమ్ దిగ్గజ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) కనిపించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే వాళ్లు సినిమాలో కూడా క్రికెటర్లుగానే కనిపిస్తారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో క్రికెట్ కి సంబంధించిన ఒక సీన్ అయితే ఉందట దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తుంది.

    Also Read: NTR-Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

    మరి రాజమౌళి సినిమా అంటే మార్కెట్ పరంగా కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి వీళ్లను సినిమాలో చేర్చడం వల్ల మార్కెట్ అనేది ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యం తోనే తను అలా చేసినట్టుగా తెలుస్తుంది… చూడాలి మరి ఈ సినిమా పంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది… ఇక 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మొదటి తెలుగు సినిమా కూడా ఇదే కావడం విశేషం…