Heart Pain: గుండె నొప్పికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి? ఇంతకీ చేయాలా వద్దా?

గుండె నొప్పికి ఇంట్లో చికిత్స చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించడం చాలా మంచిది. అంబులెన్స్ లో గుండె నొప్పికి కావాల్సిన ప్రథమ చికిత్స అందుతుంది. ఎందుకంటే ఇందులో కావాల్సిన పరికరాలు ఉంటాయి.

Written By: Raj Shekar, Updated On : June 4, 2024 5:24 pm

Heart Pain

Follow us on

Heart Pain: ఈ మధ్య చాలా మందికి గుండె నొప్పి వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా కూడా గుండె నొప్పి రావడమే ఈ మధ్య అందరిని కలవర పెడుతుంది. ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా చనిపోతున్నారు. కొందరు ఏకంగా కుర్చీలో కూర్చొని, మాట్లాడుతూ మాట్లాడుతూనే చనిపోతున్నారు. అయితే చాలా వ్యాధులకు ప్రథమ చికిత్స చేస్తారు. మరి గుండె నొప్పికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి అంటే..

గుండె నొప్పికి ఇంట్లో చికిత్స చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించడం చాలా మంచిది. అంబులెన్స్ లో గుండె నొప్పికి కావాల్సిన ప్రథమ చికిత్స అందుతుంది. ఎందుకంటే ఇందులో కావాల్సిన పరికరాలు ఉంటాయి. అయితే ఒక వేళ గుండె ఇంట్లో ఉన్నప్పుడే ఆగిపోయే పరిస్థితి ఉంటే, అంటే ఆ వ్యక్తి ఊపిరి పీల్చడానికి ఇబ్బంది పడుతుంటే, నాడి ఆగిపోయినట్టు అనిపించినా సరే ఆ వ్యక్తిని వెంటనే నేలమీద పడుకోబెట్టాలి. చుట్టూ గుంపుగా జనం ఉండకుండా చూసుకొని వ్యక్తికి గాలి ఆడేటట్టుగా చేయాలి.

నేల మీద పడుకోబెట్టిన తర్వాత చేతి మీద మరొక చేతిని పెట్టి గుండెకి ముందు వైపున ఉండే ఎముక మీద మీ బరువు అంతా పెట్టి నిలబడి గట్టిగా నొక్కాలి. అలా గట్టిగా నొక్కడం ద్వారా గుండె ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు గుండె నుంచి రక్తం పారే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఒత్తిడికి గురై ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకునే అవకాశం ఉంది. దీనిని కార్డియో పల్మనరీ రీససిటేషన్ అని అంటారు.

గుండె నొక్కుతూనే మధ్య మధ్యలో నోట్లోకి గాలి ఊదాలి. గాలి ఊదేటప్పుడు కర్చీఫ్ పెట్టుకుని ఊదటం ఇద్దరికి మంచిది. కానీ షుగర్ ఉన్న వారిలో ఈ నొప్పి ఎక్కువగా ఉండదు. గుండె నొప్పి వచ్చిన వారికి, గుండెకి రక్తం సరఫరా చేసే కరొనరీ ధమనుల్లో రక్తం గడ్డకట్టుకుపోతే ఆ గడ్డలను కరిగించడానికి స్టెప్టోకైనేస్ అనే పద్ధతిని వాడుతుంటారు వైద్యులు. దీనిని ఎస్టీకే చికిత్స అని పిలుస్తారు.

అయితే ఈ విధానంలో మందుని ఇంజక్షన్ ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. అలా మందు శరీరంలోకి ఎక్కించడం ద్వారా కరొనరీ ధమనుల్లో ఉన్న రక్తం గడ్డ కరిగిపోయి ప్రవహిస్తుంది. కొన్ని సందర్భాల్లో యాంజియోగ్రామ్ చికిత్స చేస్తారు. సో అవసరం అయితే మాత్రమే ప్రథమ చికిత్స చేయండి. లేదంటే త్వరగా ఆస్పత్రికి తీసుకొని వెళ్లండి.