https://oktelugu.com/

Hair Cut: జుట్టు కట్ చేస్తే మరింత ఎక్కువు పెరుగుతుందా?

కాస్ట్ లీ ప్రాడెక్ట్స్‌ వాడినా సరే.. జుట్టుకు సరైన పోషణ అందించాలి. ఖరీదైన వాటి వల్ల జుట్టు పెరగదు. జుట్టుకు సరైన పోషణ అందాలి. అందుకే ముందు తిండిపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. జుట్టు, చర్మం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : June 4, 2024 / 05:30 PM IST

    Hair Cut

    Follow us on

    Hair Cut: అందంగా, ఆరోగ్యంగా ఉండాలి అని ఎవరు కోరుకోరు చెప్పండి. కానీ సాధ్యం అవ్వాలంటే చాలా విషయాల్లో సాధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం, అందం కూడా మీ సొంతం అవుతాయి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు అన్ని పోషకాలూ శరీరానికి అంది..ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరికి చేరవు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు ప్రధాన సమస్యగా మారింది. జుట్టు అందంగా, ఒత్తుగా, పొడుగ్గా రావాలని ఆడ, మగ అందరూ అనుకుంటారు.

    ఇదెలా ఉంటే ఈ జుట్టును కత్తిరించుకుంటూ త్వరగా పెరుగుతుంద అనుకుంటారు చాలా మంది. నిజంగానే జుట్టును కత్తిరించుకుంటూ ఎక్కువగా పెరుగుతుందా? దీని వెనక నిజం ఎంత అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఇలా జుట్టును కత్తిరించుకోవడం వల్ల జుట్టు పెరుగుతుంది అనడంలో ఏ మాత్రం నిజం లేదు అంటున్నారు నిపుణులు. తలపై ఉండే స్కాల్ఫ్‌లోని ఫోలికల్స్ తో మాత్రమే జుట్టు పెరుగుతుందట.

    అయితే జుట్టు కత్తిరించుకోవడం వల్ల ప్రయోజనం మాత్రం ఉంటుందట. కానీ ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా.. అప్పుడప్పుడూ జుట్టును ట్రిమ్ చేసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయట. అందులో ముఖ్యంగా జుట్టు కాస్త పెరుగుతుంది అంటారు. ఇక అప్పుడప్పుడూ అయినా జుట్టును కత్తిరించడం వల్ల చిట్లిన చివర్లను వదిలించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

    కాస్ట్ లీ ప్రాడెక్ట్స్‌ వాడినా సరే.. జుట్టుకు సరైన పోషణ అందించాలి. ఖరీదైన వాటి వల్ల జుట్టు పెరగదు. జుట్టుకు సరైన పోషణ అందాలి. అందుకే ముందు తిండిపై దృష్టి పెట్టండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. జుట్టు, చర్మం రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. దీని కోసం మీరు ఖరీదైన షాంపూలు, కండీషనర్ లు వాడాల్సిన అవసరం లేదు.

    సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. కానీ దీన్ని ఒకే తెలుగు నిర్ధారించదు.