Kalki Movie: కల్కి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా..?

Kalki Movie: అందులో భాగంగానే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని డిజైన్ చేసినట్టుగా దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు.

Written By: Gopi, Updated On : June 4, 2024 11:25 am

Do you know who is the special guest for Kalki pre-release event

Follow us on

Kalki Movie: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో భారీ బిజినెస్ చేయడానికి రాబోతున్న సినిమాల్లో ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న కల్కి సినిమా ఒకటి…దాదాపు 600 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా రాకతో ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని సినిమా యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేశారు.

అందులో భాగంగానే ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాని డిజైన్ చేసినట్టుగా దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Ashwin) సినిమా గురించిన విశేషాలను తెలియజేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఒక ప్రభంజనాన్ని సృష్టించబోతుంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా మీద మరింత అంచనాలను పెంచడానికి సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి సినిమా మేకర్స్ ప్లానింగ్ అయితే చేస్తున్నారు.

Also Read: NTR-Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

ఇక దీనికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవితో(Chiranjeevi) పాటు పలువురు తెలుగు సినిమా స్టార్ హీరోలు కూడా ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి. ఇక మొత్తానికైతే ప్రభాస్ తనదైన రీతిలో సినిమాను చేయడమే కాకుండా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి భారీగా ప్రమోషన్స్ ని కూడా నిర్వహిస్తున్నాడు. ఇక జూన్ రెండో వారంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తుంది.

Also Read: NTR-Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

ఇక ఈ సినిమాలో దిగ్గజ నటులు అయిన అమితాబచ్చన్, కమలహాసన్ లాంటి వారు నటించడం అనేది నిజంగా ఈ సినిమా స్థాయిని పెంచిందనే చెప్పాలి. ఇక ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ ఈ సినిమాకి ఎక్కడా కూడా తగ్గకుండా భారీగా ఖర్చు పెట్టడమే కాకుండా సినిమా అవుట్ పుట్ ని చాలా అత్యద్భుతంగా తీసుకురావడంలో చాలా వరకు హెల్ప్ చేశాడు… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…