NTR-Prashanth Neel: ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమాలో విలన్ ఎవరో తెలుసా..?

NTR-Prashanth Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని చేయబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే... అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని కూడా ఆ సినిమా యూనిట్ అలాగే ప్రశాంత్ నీల్ అందిస్తూ వస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 4, 2024 10:23 am

Do you know who is the villain in NTR Prashant Neel movie

Follow us on

NTR-Prashanth Neel: నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఎన్టీఆర్(NTR)… ప్రస్తుతం ఈయన కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్ లో ‘దేవర ‘(Devara) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ తో పాటు, ప్రేక్షకులు కూడా మంచి అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక దీని తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని చేయబోతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే… అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని కూడా ఆ సినిమా యూనిట్ అలాగే ప్రశాంత్ నీల్ అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి చేసి పెట్టినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో లో రాబోతున్న ఈ సినిమా మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలైతే ఉన్నాయి.

Also Read: Kalki 2898 AD : కల్కి’లో బుజ్జి కాపీనా… ప్రభాస్ పెదనాన్న సినిమా నుండే లేపేసిన నాగ్ అశ్విన్!

ఇక ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేయడం విశేషం.. దానికి కూడా ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారు అనే ప్రశ్నలు కూడా ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల్లో తలెత్తుతున్నాయి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడట. ఒక పాత్ర హీరో కాగా, మరొకటి విలన్ పాత్ర అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీఆర్ అటు హీరోగాను, ఇటు విలన్ గాను రాణించబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Chiranjeevi : చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో ఈ ఒక్క పాత్ర ఎందుకు చేయలేదు..?

ఈ కాలంలో ఉన్న హీరోల్లో ఏ ఒక్క హీరో కూడా విలన్ గా హీరోగా నటించలేదు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఆ ఘనతను సాధించిన మొదటి హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుంది అనేది…