Star Anchor Taught Sree Vishnu: క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని మొదలుపెట్టి, ఆ తర్వాత హీరో గా చిన్న చిన్న సినిమాలు తీసుకుంటూ, తద్వారా తన టాలెంట్ తో నెమ్మదిగా గుర్తింపు తెచ్చుకొని,నేడు టాలీవుడ్ లోనే మినిమం గ్యారంటీ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో శ్రీవిష్ణు(Sree Vishnu). తన ప్రతీ సినిమాతో కొత్తగా ప్రయత్నం చేస్తూ, ఆడియన్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతి ఇవ్వాలని తపన పడే హీరోల్లో ఒకడు ఆయన. సీరియస్ జానర్ సినిమాలు చేయగలడు, అదే విధంగా కామెడీ జానర్ సినిమాలు కూడా చేయగలడు. ఈయన సీరియస్ జానర్ సినిమాలకంటే కామెడీ జానర్ సినిమాలకు క్రేజ్ ఎక్కువ. కామెడీ టైమింగ్ విషయం లో శ్రీవిష్ణు కి పోటీ ఇచ్చే యంగ్ జనరేషన్ హీరో మరొకరు లేరు అని ఇండస్ట్రీ లో అందరు అంటుంటారు. బయట తనపై ఎవరైనా పంచులు వేయాలని చూస్తే క్షణాల వ్యవధిలోనే ఆటో పంచులు వేస్తూ వాళ్ళ నోర్లు మూయించడం శ్రీ విష్ణు కి వెన్నతో పెట్టిన విద్య.
తన కామెడీ టైమింగ్ తో సెలెబ్రిటీస్ ని ఒక ఆట ఆడుకునే యాంకర్ సుమ(Suma Kanakala) ని కూడా ఒకసారి ఆట పట్టించాడు శ్రీవిష్ణు. ఆ వీడియో ని చూస్తే ఎలాంటి వారికైనా నవ్వు రాక తప్పదు. ముందుగా యాంకర్ సుమ శ్రీ విష్ణు పై పంచ్ వేస్తూ ‘ఏంటి నువ్వు అసలు..ఇంటర్మీడియట్ కలిసి చదివాము, ఇందాక స్టేజి మీద గుర్తు చేస్తే కానీ నీకు గుర్తు రాలేదు’ అని అంటుంది. అప్పుడు శ్రీ విష్ణు కౌంటర్ ఇస్తూ ‘అంటే నాకు లెక్చరర్స్ ని మర్చిపోయే అలవాటు ఉంది’ అని అంటాడు. అప్పుడు సుమ దానికి కౌంటర్ ఇస్తూ ‘నేను లెక్చరర్ అయిపోయాను, కానీ నువ్వు ఇంకా ఇంటర్మీడియట్ ఫినిష్ చేయలేదు అక్కడ’ అని అంటుంది. అప్పుడు శ్రీ విష్ణు ‘మీరు చదువు చెప్పారు కాబట్టే అక్కడే ఉండిపోయాను నేను’ అని అంటాడు.
Also Read: Sri Vishnu : శ్రీవిష్ణు కి బంపర్ ఆఫర్..బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ..డైరెక్టర్ ఎవరంటే!
పాపం ఆ తర్వాత సుమ నోటి నుండి మాట రాలేదు. నవ్వుతూ పక్కకి వెళ్ళిపోయింది. శ్రీవిష్ణు కే పంచులు వెయ్యాలని చూస్తావా?,బాగా అయ్యింది గా అంటూ ఆ వీడియో కింద నెటిజెన్స్ నవ్వుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే శ్రీవిష్ణు ‘సింగిల్’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. చాలా సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రీసెంట్ గానే ఓటీటీ లో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ కి ఆడియన్స్ ఫిదా ఐపోతున్నారు. కేవలం ఆరు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం 35 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.