YS Jagan Dialogues In Raja Saab: సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా ఎక్కడ చూసిన ప్రభాస్(Rebel Star Prabhas) ‘రాజా సాబ్'(Raja Saab) మేనియా నే కనిపిస్తుంది. మొన్న విడుదల చేసిన టీజర్ ఆ రేంజ్ లో ఉంది మరీ. ఇప్పటికీ ఈ టీజర్ టాప్ లోనే ట్రెండ్ అవుతూ ఉంది. ముఖ్యంగా ప్రభాస్ నోటి నుండి వచ్చిన ప్రతీ డైలాగ్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ‘బాహుబలి’ సిరీస్ నుండి సలార్ వరకు వరుసగా సీరియస్ రోల్స్ చేస్తూ ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దూరం అయ్యాడు. మళ్ళీ ఈ చిత్రం తో ఆ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని మన ముందుకు రాబోతున్నాడు. ముఖ్యంగా ‘రాజా సాబ్’ టీజర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. టీజర్ చివర్లో ‘తాత బయట వైర్ కొరికేశాడేమో చూడండి రా’ అని భయపడుతూ చెప్పిన డైలాగ్ హైలైట్ అయ్యింది.
అయితే ఈ టీజర్ లో ఒక డైలాగ్ ని అభిమానులు చాలా మంది గమనించలేదు. ‘అసలే మన పరిస్థితి అంతంత మాత్రమే’ అని అంటాడు. ఈ డైలాగ్ ని జగన్(Ys Jagan Mohan Reddy) ని ఉద్దేశించి రాశారు అని సోషల్ మీడియా లో ఒక వాదన వినిపిస్తుంది. 2024 ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ తన అభ్యర్థులకు ప్రచారం చేస్తూ ‘మంచివాడు..సౌమ్యుడు..కానీ ఆర్థికంగా అంతంత మాత్రమే’ అని తనదైన మ్యానరిజమ్స్ తో చెప్తాడు. ‘రాజా సాబ్’ టీజర్ లో కూడా ప్రభాస్ ఈ డైలాగ్ చెప్తూ, చేతులు జగన్ లాగా అటు ఇటు ఊపుతూ ఇమిటేట్ చేసాడని అంటున్నారు. దీని మీద ఇప్పటికే మీమ్స్ కూడా బాగా వచ్చేసాయి. అయితే డైరెక్టర్ కావాలని జగన్ ని ఉద్దేశించి ఈ డైలాగ్ రాసి ఉండదని అనుకుంటున్నారు నెటిజెన్స్. కంటెంట్ కి తగ్గట్టు ఫ్లోలో ఆ డైలాగ్ వచ్చి ఉండొచ్చని అంటున్నారు.
ప్రభాస్ కూడా కావాలని ఒకరిని ఇమిటేట్ చేయడానికి ఇష్టపడడు. ఇది సినిమాలో సహజంగా వచ్చిన ఫ్లోలోనే చెప్పి ఉంటాడని వైసీపీ అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. లేకపోతే ఈపాటికి వైసీపీ సోషల్ మీడియా ‘బ్యాన్ రాజాసాబ్’ అంటూ ట్రెండ్ చేసేవారు. ఇది వరకు అనేక సినిమాలకు వాళ్ళు ఈ విధమైన ట్రెండ్స్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ , మాళవిక మోహనన్ నటించిన సంగతి తెలిసిందే. టీజర్ లో వీళ్లిద్దరు చూసేందుకు ఎంతో హాట్ గా కనిపించారు. ముఖ్యంగా మాళవిక మోహనన్ కి ఇదే మొట్టమొదటి సినిమా. డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. పాన్ ఇండియా లెవెల్ లో కచ్చితంగా ఈ చిత్రం మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.