Sri Vishnu : ఒకప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టు గా మంచి పేరు తెచ్చుకున్న శ్రీవిష్ణు(Sree Vishnu), ఆ తర్వాత హీరో గా మారి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ కుర్రాడిలో చాలా టాలెంట్ ఉంది, పెద్ద రేంజ్ కి వెళ్ళడానికి ఒక సూపర్ హిట్ పడితే బాగుండును అని ప్రతీ మూవీ లవర్ కోరుకునేవారు. ఆ హిట్ రావడానికి చాలా కాలమే పట్టింది. ‘బ్రోచేవారెవరురా’ చిత్రం ఇతనికి హీరోగా మొట్టమొదటి సక్సెస్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్స్ వచ్చాయి. ‘రాజరాజ చోరా’ సూపర్ హిట్ తో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా అన్ని ఫ్లాప్స్ వచ్చాయి. అలాంటి సమయంలో శ్రీవిష్ణు కి ‘సామజవరగమనా’ చిత్రం మంచి ‘గేమ్ చేంజర్’ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత విడుదలైన ‘స్వాగ్’ చిత్రానికి విన్నూతన ప్రయత్నం అనే పేరైతే వచ్చింది కానీ, సక్సెస్ అవ్వలేదు.
Also Read : బాలయ్య బోయపాటి లకు ఏమైంది..? ఎడమొఖం పెదమొఖం గా ఉంటున్నారా..?
ఇక రీసెంట్ గా విడుదలైన ‘సింగిల్’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాని జనాల్లోకి ప్రొమోషన్స్ ద్వారా తీసుకెళ్లడం లో శ్రీవిష్ణు బ్లాక్ బస్టర్ అయ్యాడు అనే చెప్పాలి. ట్రైలర్ తోనే ఆడియన్స్ ని విశేషంగా ఆకర్షించాడు. విడుదల తర్వాత సినిమా అంచనాలకు మించే ఉంది కానీ, తగ్గి మాత్రం లేదు. ఈ సినిమా తర్వాత శ్రీవిష్ణు ఏమి చేయబోతున్నాడు అనే సందేహం ఆయన్ని ఇష్టపడే ప్రతీ ఒక్కరిలో ఉంది. అయితే శ్రీవిష్ణు కి ఇప్పుడు టాలీవుడ్ నుండి పాన్ ఇండియా హీరో గా ఎదగడానికి ఒక అవకాశం దొరికింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ, శ్రీవిష్ణు తో ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని తీసేందుకు రీసెంట్ గానే చర్చలు జరిపారట. బాలీవుడ్ లో మంచి పేరున్న డైరెక్టర్ ఈ చిత్రానికి పని చేయబోతున్నాడట. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను తెలియజేస్తామంటూ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ క్లిక్ అయితే శ్రీవిష్ణు రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో మోత మోగిపోతుందని, అతని టాలెంట్ కి తగ్గ గుర్తింపు ఇన్ని రోజులకు దక్కబోతుందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం తెలుగు లో శ్రీవిష్ణు రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్ అట. అదే విధంగా సొంత నిర్మాణ సంస్థ లో కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తూ ఆయన హీరో గా ఒక సినిమా చేయబోతున్నాడట. ఈ రెండిటి తర్వాతనే హిందీ ప్రాజెక్ట్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.