SSMB 29: అపజయం ఎరుగని దర్శకుడు రాజమౌళి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో ఆయన ఎవరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగాడు. ఈసారి ఆయన హాలీవుడ్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. SSMB 29బడ్జెట్ దాదాపు రూ. 1000 కోట్లు అని సమాచారం. రాజమౌళి యూనివర్సల్ సబ్జెక్టు ఎంచుకున్నారు. జంగిల్ అడ్వంచ్ డ్రామాగా రాజమౌళి తెరకెక్కించనున్నారు. రాజమౌళి తండ్రి కథ సమకూర్చాడు.
మరి యూనివర్సల్ కథకు తగ్గ హీరో మహేష్ బాబు అని రాజమౌళి భావించారు. ఫస్ట్ టైం మహేష్-రాజమౌళి కాంబోలో మూవీ సిద్ధం అవుతుంది. ఇంత వరకు పాన్ ఇండియా మూవీ చేయని మహేష్ బాబు ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో SSMB 29 ఉంటుందని రాజమౌళి తెలియశారు. ఇక హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు ఈ మూవీ లో భాగం కనున్నారు.
వీటన్నింటికీ మించి మరొక ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది. ఈ మూవీ లో మరో స్టార్ హీరో నటిస్తున్నారట. మహేష్ బాబు అన్నయ్య పాత్రకు టాలీవుడ్ హీరోని రాజమౌళి ఎంపిక చేశారట. విక్టరీ వెంకటేష్ SSMB 29 లో మహేష్ బాబు అన్నయ్యగా నటిస్తున్నాడట. గతంలో వీరిద్దరూ సీతమ్మ వాకిట్లో సిరి మల్లెచెట్టు చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు. మరోసారి వారిద్దరూ సిల్వర్ స్క్రీన్ ని షేర్ చేసుకోనున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
ఇటీవల రహస్యంగా పూజ కార్యక్రమాలు పూర్తి చేశారు. తన సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ మహేష్ బాబు పూజ కార్యక్రమానికి హాజరయ్యాడు.