SSMB 29: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు.ఇక ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాని చేస్తున్నాడు. ఇక ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ మొదటి నుంచి చాలా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు ఇందులో శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక దానికోసమే మహేష్ బాబు లుక్ ను రివిల్ చేయకుండా కేవలం మహేష్ బాబు మెడలో వేసుకున్న ఢమరుకం, శివలింగం లాంటి వాటిని చూపిస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక దాంట్లో తన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో ముందుగానే రాజమౌళి రివిల్ చేశాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
Also Read: ‘కిష్కిందపురి’ మూవీ టాక్ వచ్చేసింది… ఏంటి భయ్యా మరీ ఇలా ఉంది…
మరి మహేష్ బాబు కనుక ఈ సినిమాలో శ్రీరాముడిగా నటిస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లడం ఖాయం అంటూ సినిమా మేధావులు సైతం ఇప్పటికే వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక నార్త్ అభిమానులైతే మహేష్ బాబుకు నీరాజనాలు పడతారు. అలాగే మహేష్ బాబు పాత్రను చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాని చూస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
మరి రాజమౌళి కావాలనే ఈ సినిమాలో మహేష్ బాబు చేత శ్రీరాముడి పాత్రను వేయించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ మహేష్ బాబు కనక ఆ పాత్రను వేసినట్లయితే ఎన్టీఆర్, బాలయ్య బాబు పక్కన ఈయన పేరు కూడా నిలుస్తోంది. ఇక ఈ తరం హీరోల్లో రాముడి పాత్ర వేసిన హీరో ఎవరు లేరు కాబట్టి ఆ క్రెడిట్ కూడా మహేష్ బాబుకే దక్కుతోంది.
మరి జక్కన్న ఏ రకంగా ఆలోచిస్తున్నాడో తెలియదు గానీ ఈ వార్త నిజమై జక్కన్న నోటి నుంచి వస్తే మహేష్ బాబు అభిమానులందరు చాలా సంతోషంగా ఉంటామంటూ వాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను రాజమౌళి నవంబర్ నుంచి ఇస్తానని ఇంతకుముందు చాలా క్లియర్ కట్ గా చెప్పాడు. కాబట్టి ఇక ఆ సినిమాకు సంబంధించిన అప్డేట్ రావాలంటే మరో 2 నెలల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది…