Sujeeth OG: మరో రెండు వారాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఓజీ'(They Call Him OG) కనీవినీ ఎరుగని భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కారణం యాక్షన్ చిత్రం అవ్వడం వల్లే. పవన్ కళ్యాణ్ ని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా స్టైలిష్ అవతారం లో చూసేందుకు ఇష్టపడుతారు. అందుకే ఈ చిత్రానికి ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్లినా ఓజీ మేనియా నే కనిపిస్తుంది. ఎల్లుండి విడుదల అవ్వబోతున్న రెండు సినిమాల ప్రొమోషన్స్ లో కూడా ఆయా చిత్రాలకు సంబంధించిన నటీనటులను ఆడియన్స్ ఓజీ గురించే అడుగుతున్నారు. ఈమధ్య కాలం లో ఒక సినిమాకు ఇంతటి క్రేజ్ రావడం ఎప్పుడూ చూడలేదు. అభిమానుల్లో క్రేజ్ కి తగ్గట్టు ప్రొమోషన్స్ చేయడం లేదనే చిన్న కంప్లైంట్ ఉంది కానీ, 12 నుండి గ్రాండ్ గా ప్రొమోషన్స్ మొదలు అవుతాయని అంటున్నారు.
Also Read: ‘కిష్కిందపురి’ మూవీ టాక్ వచ్చేసింది… ఏంటి భయ్యా మరీ ఇలా ఉంది…
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా విడుదలయ్యాక కొన్ని రోజులు సుజిత్ మీడియా కి కనిపించడట. వామ్మో ఇదేమి నిర్ణయం..?, అంటే సినిమా తేడా గా ఉందా అనే అనుకుంటున్నారు కదా?, అంత సీన్ లేదు లేండి, ఆయన తదుపరి చిత్రం నేచురల్ స్టార్ నాని తో చేయబోతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ‘సరిపోదా శనివారం’ తర్వాత రావాలి. కానీ ఓజీ చిత్రం ఉండడం వల్ల ఆలస్యం అయ్యింది. అయితే ఇక మీదట ఆలస్యం చెయ్యాలని అనుకోవడం లేదట సుజిత్. అందుకే ఓజీ విడుదల అయ్యాక, ఆయన తన టీం తో కలిసి యూరోప్ కి వెళ్ళబోతున్నాడట. అక్కడ కొన్ని లొకేషన్స్ ని వేటాడే పనిలో ఉంటారట కొన్ని రోజులు. అంతే కాకుండా స్క్రిప్ట్ సరిపడా టెక్నీషియన్స్ వేట లో భాగంగా కూడా ఆయన యూరోప్ కి వెళ్తున్నాడట. ఈ ఏడాది చివరి నుండి ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఓజీ చిత్రం సుజిత్ కి చాలా పెద్ద ఛాన్స్. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలుస్తాడు. చూడాలి మరి ఆయన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.