SS Rajamouli Comments On Chiranjeevi: ఆంద్రప్రదేశ్ టికెట్ రేట్ల విషయంలో మెగాస్టార్ చిరంజీవి పై చాలామంది చాలా రకాలుగా విమర్శలు చేశారు. కానీ, రాజమౌళి మాత్రం ప్రశంసలు కురింపించారు. చిరంజీవే తెలుగు చిత్రసీమకు పెద్ద దిక్కు అని జక్కన్న క్లారిటీ ఇచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు థ్యాంక్స్ చెబుతూనే.. దాని వెనుక కారణం మెగాస్టార్ అంటూ రాజమౌళి చెప్పారు.
ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆదివారం.. చిక్బల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా.. రాజమౌళి మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవిని ఆకాశానికెత్తేశారు. రాజమౌళి మాటల్లోనే.. ‘టికెట్ల ధరల పెంపు కోసం కృషిచేసిన మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక కృజ్ఞతలు. ఏపీ సీఎంతో పలుమార్లు భేటీ అయ్యి, టికెట్ల ధరల పెంపునకు చిరంజీవి ఎంతో కృషి చేశారు, దీనిపై చాలామంది చిరంజీవిగారిని విమర్శించారు.
Also Read: ‘ఎన్టీఆర్ – చరణ్’ల పై రాజమౌళి క్రేజీ కామెంట్స్
కానీ మెగాస్టార్ గారు మాత్రం పట్టించుకోకుండా సినిమా కోసం, సినిమా ఇండస్ట్రీ బాగు కోసం ప్రయత్నించారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమను నెగ్గించడానికి, మనల్ని గెలిపించడానికి చిరంజీవి గారు తగ్గి, ఎన్నో మాటలు పడ్డారు. అందుకే, తెలుగు సినీ పరిశ్రమ ఎప్పటికీ చిరంజీవి గారికి రుణపడి ఉండాలి. నిజానికి సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు మెగాస్టార్ ఇష్టపడరు.
ఆయనెప్పుడూ ఇండస్ట్రీ బిడ్డగా ఉండేందుకే ఇష్టపడతారు. కానీ ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, చిరంజీవి ట్రూ మెగాస్టార్’ అని రాజమౌళి ఎమోషనల్ అవుతూ చిరంజీవి గారి గురించి ఆకట్టుకుంది. ఇక ప్రీ టికెట్ సేల్స్‌లో సంచలనం సృష్టించింది ఆర్ఆర్ఆర్. చరణ్, తారక్ అభిమానులు ఒక్క టికెట్‌తో ఆగట్లేదట. ఒక్కొక్కరు రెండేసి టికెట్లు కొంటున్నారు.
పైగా నిజమైన మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రావట్లేదు. ఈ సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పోరుకథ ఇదీ