YCP vs BJP: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఇన్నాళ్లు వైసీపీ బీజేపీకి పరోక్షంగా మద్దతునిచ్చినా ప్రస్తుతం దాన్ని విరోధిగానే చూస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీల మధ్య వైరుధ్యాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబును కూడా ఇలాగే వాడుకుని ఒదిలేసి చివరకు అధికారానికి దూరం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీకి కూడా అదే గతి పడుతుందనే అంచనాలు వస్తున్నాయి. దీంతో ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయి.
ఇన్నాళ్లు అన్నింట్లో వైసీపీ బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలైనా త్రిపుల్ తలాక్ బిల్లు అయినా, 370 ఆర్టికల్ రద్దు విషయంలోనైనా బీజేపీకి వైసీపీ మద్దతు ఇచ్చింది. దీంతో బీజేపీ అన్ని బిల్లులను పాస్ చేయించింది. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసిన సందర్భంలో ఏపీలో జగన్ పై ప్రత్యక్ష పోరాటానికి సై అంటోంది. దీంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
Also Read: Mallu Swarajyam: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పోరుకథ ఇదీ
ఒక వైపు కేసులు, మరోవైపు బీజేపీ ఎదురుదాడితో జగన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిపోరే చేయాల్సి వస్తోందని చూస్తున్నారు. దీని కోసం అన్ని దారులు వెతుక్కుంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ సైతం బీజేపీతో కలిసి నడిచేందుకు మొగ్గు చూపుతుండటంతో వైసీపీ కి భయం పట్టుకుంది. రెండు పార్టీలు ఒక్కటైతే తమ ఓటు బ్యాంకు చీలడం ఖాయమనే ఉద్దేశంతో జగన్ భయాందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం చెప్పినట్లు కరెంటు మోటార్లకు మీటర్లు బిగించేందుకు కూడా జగన్ వెనుకాడలేదు. దీంతో తెలంగాణ మంత్రి హరీష్ రావు జగన్ పై విమర్శలు చేసినా పట్టించుకోలేదు. కానీ ఈ సారి మాత్రం బీజేపీ వైసీపీనే టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కూడా జగన్ ను వేధిస్తోంది. దీంతో చుట్టు ముట్టిన సమస్యలతో వైసీపీ కోలుకోలేకపోతోంది. బీజేపీ నేతల తీరుతో జగన్ మునుముందు ఇంకా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో టీడీపీ కూడా ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ప్రత్యక్ష పోరుకు దిగి చేయి కాల్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ వంతు కావడం గమనార్హం. రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉంటాయో? ఎవరు ఎవరితో జత కలుస్తారో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎజెండా అధికారమే అయినా ఏ పార్టీ విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: KCR Plans: ముందస్తు ఎన్నికలా? కేటీఆర్ ను సీఎం చేయడమా? కేసీఆర్ ప్లాన్ ఏంటి?
Recommended Video: