https://oktelugu.com/

Sruthi Haasan: బ్రేకప్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శృతి హాసన్… ఫ్యాన్ కి స్ట్రాంగ్ కౌంటర్

Sruthi Haasan: కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శృతి హాసన్. గత కొంతకాలంగా సినిమాలు తగ్గించిన ఈ భామ ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ లైఫ్ గడిపేస్తుంది. ప్రస్తుతం సెలబ్రెటీలకు, అభిమానులకు మధ్య వారధిగా ఉంది సోషల్ మీడియా. ఎప్పటికప్పుడు తమ లేటేస్ట్ ఫోటోస్, పర్సనల్ విషయాలు… మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‏కు టచ్ లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 1, 2022 / 12:24 PM IST
    Follow us on

    Sruthi Haasan: కమల్ హాసన్ వారసురాలిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శృతి హాసన్. గత కొంతకాలంగా సినిమాలు తగ్గించిన ఈ భామ ఇటీవల క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ లైఫ్ గడిపేస్తుంది. ప్రస్తుతం సెలబ్రెటీలకు, అభిమానులకు మధ్య వారధిగా ఉంది సోషల్ మీడియా. ఎప్పటికప్పుడు తమ లేటేస్ట్ ఫోటోస్, పర్సనల్ విషయాలు… మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‏కు టచ్ లో ఉంటున్నారు.

    శృతి హాసన్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. అయితే కొన్నిసార్లు నెటిజన్స్ నుంచి అనుకొని ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అయితే వాటికి అందరూ నటీనటులు రియాక్ట్ అవ్వరు. కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే తమదైన శైలీలో ఆన్సర్ ఇస్తుంటారు. ఇటీవల ఓ నెటిజన్ ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రష్మిక మందన్న. తాజాగా హీరోయిన్ శృతి హాసన్ ఓ నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది.

    తాజాగా గురువారం ఇన్ స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు శృతి హాసన్. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఇప్పటివరకు మీ జీవితంలో ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి ? అని ప్రశ్నించాడు. దీంతో వెంటనే మీకెంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు ? అని రివర్స్ లో ప్రశ్నించింది శృతి హాసన్. నీకు ఎంతమంది లవర్స్ ఉన్నారు ? నువ్వు ప్రశ్నలు అడిగిన విధానం బట్టి చూస్తే నీకసలు లవర్ లేదని నా అభిప్రాయం అంటూ కౌంటరిచ్చింది శృతి. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తోంది. అలాగే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణకు జోడీగా చేస్తుంది.