https://oktelugu.com/

Hari Hara Veeramallu : కొత్త సంవత్సరం నుండి ‘హరి హర వీరమల్లు’ మేనియా మొదలు..అభిమానులకు బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వనున్న మేకర్స్!

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని ఏడాది అని చెప్పొచ్చు. ఎందుకంటే మెగా కుటుంబం రాకీయంగా సక్సెస్ ని చూసేందుకు 15 ఏళ్ళ నుండి కష్టపడుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 24, 2024 / 08:30 AM IST

    Hari Hara Veeramallu

    Follow us on

    Hari Hara Veeramallu : ఈ ఏడాది పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని ఏడాది అని చెప్పొచ్చు. ఎందుకంటే మెగా కుటుంబం రాకీయంగా సక్సెస్ ని చూసేందుకు 15 ఏళ్ళ నుండి కష్టపడుతుంది. ప్రజారాజ్యం పార్టీ అంచనాలను అందుకోలేకపోయింది. ఆ పార్టీ ని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత, 2014 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీ ని స్థాపించాడు. ఎన్నికల్లో పోటీ చేసేంత సమయం అప్పటికే లేకపోవడంతో టీడీపీ, బీజేపీ పార్టీలకు సంపూర్ణంగా మద్దతు పలికి, కూటమి అధికారం లోకి రావడానికి కారణమయ్యాడు. సక్సెస్ ఇక్కడ వచ్చింది కానీ, పవన్ కళ్యాణ్ పవర్ ఎంజాయ్ చెయ్యలేదు. 2019 వ సంవత్సరంలో విడిగా పోటీ చేసి ఘోరమైన పరాజయం ని అందుకున్న పవన్ కళ్యాణ్, ఈ ఏడాది టీడీపీ, బీజేపీ తో చేతులు కలిపి, NDA కూటమి ఆంధ్ర ప్రదేశ్ , కేంద్రం లో పవర్ లోకి రావడానికి ప్రధాన కారణమయ్యాడు.

    డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టి, కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే కాదు, నేషనల్ లెవెల్ పాలిటిక్స్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. ఆయన అభిమానులు పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేస్తున్న పొలిటికల్ సక్సెస్ ని ఎంతో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆయన హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నాయి. వీటిల్లో ముందుగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల కాబోతుంది. వచ్చే ఏడాది మార్చి 28 న విడుదల కాబోతున్న ఈ సినిమాకి కేవలం నాలుగు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ 16 గంటల సమయం కేటాయిస్తే షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టే.

    ప్రస్తుతం ఆయన ఎంత బిజీ గా ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. కానీ ఈ నెలాఖరు లోపు షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారట. ఇదంతా పక్కన పెడితే కొత్త సంవత్సరం లో ఈ చిత్రం నుండి ఒక పాట విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పాడిన ఈ పాటని డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేయబోతున్నారు. జనవరి నెల నుండి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ రోజుకి ఒకటి వస్తుందని టాక్. ప్రతీ అప్డేట్ సినిమా కంటెంట్ ని తెలిపేలా ఉంటుందట. ఇది #RRR కి మించిన సినిమా అని, కంటెంట్ బయటకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సినిమానా అని అభిమానులు ఆశ్చర్యపోతారని, అంత అద్భుతంగా ఈ చిత్రం వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరి వాళ్ళు చెప్పిన రేంజ్ లో ఈ సినిమా ఉందా లేదా అనేది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.