Sresthi Varma – Jani Master: గత ఏడాది జానీ మాస్టర్ పై ఆయన టీం లో పని చేసిన శ్రేష్టి వర్మ అనే అమ్మాయి లైంగిక వేధింపుల కేసు పెట్టడం, దానికి జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి రిమాండ్ లో నెల రోజుల పాటు జైలులో ఉండడం, ఆ తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు రావడం వంటివి మన అందరికీ తెలిసిందే. ఈ కేసు కారణంగా ఆయనకి ఇచ్చిన నేషనల్ అవార్డుని కూడా వెనక్కి తీసుకున్నారు. అంతటి దుమారం రేపిన ఘటన ఇది. బయటకి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తన భార్య తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. తానూ ఎలాంటివాడినో జనాలకు తెలుసు అని, నన్ను నమ్ముకొని ఉన్న ప్రతీ ఒక్కరికి నేనేంటో పూర్తి తెలుసనీ, పైన నుండి దేవుడు మొత్తం చూస్తున్నాడని, ఎలాంటి తప్పు నేను చేయలేదని కోర్టు లో నిరూపించుకొని నిజాయితీ పరుడిగా బయటపడుతానని చెప్పుకొచ్చాడు జానీ మాస్టర్.
ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ పై కేసు వేసిన ‘శ్రేష్టి వర్మ’ రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కి కౌంటర్ గా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ ‘ ఒక అమ్మాయిని శారీరకంగా, మానసికంగా వాడుకొని, మరో అమ్మాయితో సంబంధం పెట్టుకుంటే చూస్తూ కూర్చోవాలా?, చాలా మంది నేని జానీ మాస్టర్ పై కక్ష్యతో కేసు వేశానని అంటున్నారు. కానీ అందులో నిజం లేదు, నేను నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం వేశాను. ఆ క్షణం లో నాకు రెండు ఛాయస్లు ఉన్నాయి. ఒకటి నేను ఆత్మహత్య చేసుకోవడం, రెండు నేను జానీ మాస్టర్ పై పోరాటం చేయడం. నేనే రెండోదే ఎంచుకున్నాను. మా వెనుక వైసీపీ పార్టీ ఉందని, అల్లు అర్జున్ ఉన్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ నా వెనుక ఎవ్వరూ లేరు, నేను చేస్తున్నది న్యాయ పోరాటం, దానికి ఎవరి సహాయం అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘పుష్ప 2 మూవీ సెట్స్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ అక్కడికి వచ్చి నా పై చెయ్యి చేసుకున్నాడు. నన్ను అందరి ముందు అవమానించాడు. ఇది అక్కడ ఉన్న మిగతా డ్యాన్సర్లు కూడా చూసారు. కోర్టులో కేసు ఉంది కాబట్టి దీని గురించి ఇంతకు మించి మాట్లాడలేను, అన్ని కోర్టులోనే తేల్చుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది శ్రేష్టి వర్మ. జానీ మాస్టర్ లాంటి వ్యక్తి నేషనల్ అవార్డుకి అర్హుడు కానీ, ఆయనకి వచ్చిన అవార్డు ని వెనక్కి తీసుకోవడం సరైన నిర్ణయమే. కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, నేషనల్ అవార్డు వంటి ఉన్నతమైన పురస్కారానికి గుణం కూడా ఉండాలి అంటూ చెప్పుకొచ్చింది శ్రేష్టి వర్మ. ఈరోజు ఈమె ఈ స్థాయి లో ఇండస్ట్రీ లో ఉండడానికి జానీ మాస్టర్ కారణం కదా అని యాంకర్ అడిగితే, అలాంటిదేమి లేదు, నా కష్టం తోనే ఇంత దూరం వచ్చాను అని చెప్పుకొచ్చింది.