IND vs ENG : చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేశాడు. ఓటమి అంచు దాకా వెళ్లిన జట్టుకు గెలుపును అందించాడు. కేవలం 55 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, 5 సిక్సర్ల సహాయంతో 72* పరుగులు చేశాడు. తన అసాధ్యమైన ఆటతీరుతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇదే సమయంలో తిలక్ వర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు. గత నాలుగు టి20 మ్యాచ్ లలో ఒక్కసారి కూడా అతడు అవుట్ కాలేదు. మొత్తంగా 318 పరుగులు చేశాడు.. ఫలితంగా టి20లలో రెండు ఔట్ల మధ్య హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్ గా తిలక్ వర్మ సూపర్ రికార్డును తన అకౌంట్లో రాసేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు మార్క్ చాప్ మన్ పేరు మీద ఉండేది..చాప్ మన్ ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు. అతడు టి20లలో రెండు అవుట్ల మధ్య 271 రన్స్ చేశాడు. ఈ రికార్డును తిలక్ వర్మ బ్రేక్ చేశాడు. ఏకంగా మొదటి స్థానంలో నిలిచాడు. అంతేకాదు టి20 లలో రెండు అవుట్ ల మధ్య హైయెస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్ గా తిలక్ వర్మ క్రియేట్ చేశాడు. ఈ లిస్టులో టీమ్ ఇండియా తరఫున కోహ్లీ 258, సంజు శాంసన్ 257, రోహిత్ శర్మ 253, శిఖర్ ధావన్ 252 పరుగులతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
హైయెస్ట్ స్కోర్ చేసింది వీరే
టి20లలో రెండు అవుట్ల మధ్య హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో తిలక్ వర్మ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. తిలక్ వర్మ ఇప్పటివరకు 318 పరుగులు చేశాడు.. తిలక్ వర్మ గత నాలుగు ఇన్నింగ్స్ లు ఒకసారి పరిశీలిస్తే..107*, 120*, 19*, 72* పరుగులు చేశాడు. అయితే ఈ నాలుగు ఇన్నింగ్స్ లలో అతడు నాట్ అవుట్ గా ఉండడం విశేషం.
మార్క్ చాప్ మన్ గత ఐదు ఇన్నింగ్స్ లలో 271 రన్స్ చేశాడు. ఇందులో అతడు 65*, 16*, 71*, 104* 15 పరుగులు చేశాడు.
శ్రేయస్ అయ్యర్ గత నాలుగు ఇన్నింగ్స్ లలో 240 పరుగులు చేశాడు. అతడి నాలుగు ఇన్నింగ్స్ లను పరిశీలిస్తే 57*, 74*, 73*, 36 పరుగులు చేశాడు.
అరోన్ పించ్ గత నాలుగు ఇన్నింగ్స్ లలో 240 రన్స్ చేశాడు.. అతడి లాస్ట్ రెండు ఇన్నింగ్స్ ఒకసారి పరిశీలిస్తే..68*, 172 పరుగులు చేశాడు.
డేవిడ్ వార్నర్ గత ఐదు ఇన్నింగ్స్ లలో 239 రన్స్ చేశాడు.. ఇందులో అతడు 100 * , 60* , 57* 2*, 20 పరుగులు చేశాడు.
రెండు వికెట్ల తేడాతో గెలుపును అందించాడు
చెపాక్ స్టేడియంలో భారత జట్టు ఊహించినట్టుగా ఏకపక్ష విజయం సాధ్యం కాలేదు. అలాగని ఇంగ్లాండ్ జట్టు ఈ మ్యాచ్ ను అంత సులువుగా వదిలిపెట్టలేదు. ప్రతి బంతి.. ప్రతి పరుగు ఇంగ్లాండు జట్టుకు, అటు భారత జట్టుకు సవాల్ విసిరాయి. అయితే టీమ్ ఇండియాలో తిలక్ వర్మ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టును గెలిపించాడు.. 165 పరుగుల విజయ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో భారత్ చేదించేలాగా చేశాడు. తద్వారా రెండు వికెట్ల తేడాతో గెలుపును దక్కించాడు.