Sreeleela Exits Akhil Lenin: ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అందరినీ విశేషంగా ఆకర్షించి వరుసగా సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల(SreeLeela). ఈమె కెరీర్ మొత్తం మీద ఎన్ని హిట్స్ ఉన్నాయి అంటే చేతి వేళ్ళతో లెక్క పెట్టి చెప్పొచ్చు. అంత తక్కువ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. కానీ వచ్చిన ఆ అవకాశాలను కూడా ఒక్కొక్కటిగా వదిలేసుకుంటూ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిల్చింది ఈ హాట్ బ్యూటీ. ఇప్పటికే ఈమె నవీన్ పోలిశెట్టి(Naveen Polisetty) హీరో గా నటిస్తున్న ‘అనగనగ ఒక రాజు’ అనే చిత్రంలో కొన్ని రోజులు నటించి ఆ తర్వాత తప్పుకుంది. ఇప్పుడు ఈమె అక్కినేని అఖిల్(Akkineni Akhil) హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్'(Lenin Movie) నుండి కూడా తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అక్ఖిల్ శ్రీలీల కాంబినేషన్ లో ఇప్పటికే అనేక సన్నివేశాలను చిత్రీకరించారు.
Also Read: Sreeleela Engagement: వైరలవుతోన్న శ్రీలీల ఫొటోలు.. అసలు విషయమిదే
అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ లో కూడా శ్రీలీల కనిపించింది. అలాంటి ఆమె ఇప్పుడు డేట్స్ ని సర్దుబాటు చెయ్యలేక ఈ చిత్రం నుండి తప్పుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది అయితే డైరెక్టర్ తో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల కూడా ఈమె తప్పుకుందని అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నిజం అనేది పక్కన పెడితే శ్రీలీల ఈమధ్య కాలం లో ఎక్కువగా తన సమయాన్ని బాలీవుడ్ సినిమాలకే కేటాయిస్తుంది. ఇప్పటికే మూడు సినిమాల్లో అక్కడ ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మన టాలీవుడ్ లో గత కొద్దిరోజుల నుండి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. కేవలం ఈ ఒక్క సినిమా తప్ప మరో సినిమా ఆమె చేతుల్లో లేదు. అయినప్పటికీ కూడా ఈమె ఒప్పుకున్న సినిమాల నుండి కూడా తప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.
Also Read: Lenin Teaser : అక్కినేని అఖిల్ ‘లెనిన్’ టీజర్ వచ్చేసింది..ఈసారి మిస్ అయ్యేలా లేదు!
అయితే లెనిన్ చిత్రం నుండి ఈమె తప్పుకోవడం పై అక్కినేని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమా టీజర్ లో శ్రీలీల గెటప్ ని చూసిన ఫ్యాన్స్ , ఈ గెటప్ కి ఈమె అసలు సూట్ అవ్వలేదు, చాలా తేడాగా అనిపిస్తుంది, ఈమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకోవచ్చు కదా అనే అభిప్రాయం అప్పట్లో వెల్లడైంది. వాళ్ళ కోరికకు తగ్గట్టుగానే ఈ సినిమా నుండి ఆమె తప్పుకోవడం తో అక్కినేని ఫ్యాన్స్ సంతోషంగానే ఉన్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్ రోల్ కోసం మూవీ టీం మళ్ళీ వేటాడడం మొదలు పెట్టిందట. ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు, మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.