Lenin Teaser : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దాదాపుగా పదేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్కటంటే ఒక్క క్లీన్ హిట్ కూడా లేదు. మతి పోగొట్టే స్క్రీన్ ప్రెజెన్స్ తో ‘మనం’ సినిమాలో కనిపించినప్పుడు , అందరూ అఖిల్(Akkineni Akhil) ని కాబోయే సూపర్ స్టార్ అని అనుకున్నారు. ఆయన మొదటి చిత్రం ‘అఖిల్’ పై అప్పట్లో అంచనాలు మామూలు రేంజ్ లో ఉండేవి కాదు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. కానీ ఓవరాల్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ చిత్రం తర్వాత చేసిన ‘హలో’ చిత్రం యావరేజ్ గా ఆడింది, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఒక దానిని మించి ఒకటి ఘోరమైన ఫ్లాప్స్ గా నిలుస్తూ అఖిల్ కెరీర్ ని నాశనం చేసాయి. మధ్యలో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం యావరేజ్ రేంజ్ లో ఆడింది.
Also Read : కుటుంబ సభ్యులతో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు..ఫోటోలు వైరల్!
ఇక అఖిల్ కెరీర్ ని కచ్చితంగా మలుపు తిప్పుతుంది అని అనుకున్న ‘ఏజెంట్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత అఖిల్ మరో సినిమా ఒప్పుకోవడానికి చాలా సమయమే తీసుకున్నాడు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ‘లెనిన్'(Lenin Movie) అనే ఊర మాస్ చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), సూర్యదేవర నాగవంశీ(Nagavamsi) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ ని చూస్తుంటే రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ సినిమాగా అనిపిస్తుంది. బ్యాక్ డ్రాప్ కూడా అదిరిపోయింది కానీ, అఖిల్ కి ఆ గెటప్ సెట్ కాలేదు అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఈ చిత్రం ద్వారా మురళి కిషోర్ అబ్బూరు అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నాడు. ఇలా కొత్త డైరెక్టర్స్ ని నమ్మడం వల్లే అఖిల్ కి కెరీర్ లో అత్యధిక ఫ్లాప్స్ ఎదురు అవుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త డైరెక్టర్ తోనే రిస్క్ చేస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన కం బ్యాక్ అవుతాడా లేదా అనేది. ఇకపోతే ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ వ్యవహరిస్తున్నాడు. సహా నిర్మాతగా ఉంటున్న నాగవంశీ అత్యధిక శాతం సక్సెస్ రేట్ తో కొనసాగుతున్నాడు కాబట్టి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ అఖిల్ కి కాస్త కలిసిరావొచ్చు. పైగా థమన్ మ్యూజిక్ ఈ చిత్రానికి అతి పెద్ద పాజిటివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా, ఈ ఏడాది ద్వితీయార్థం లో విడుదల కాబోతుంది.
#LENIN it is….
Madness is in…. pic.twitter.com/SrDNiFJ9U3— Akhil Akkineni (@AkhilAkkineni8) April 8, 2025