Coolie Theatrical Rights: సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘కూలీ'(Coolie Movie). లియో వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా కావడం వల్లే ఈ చిత్రానికి ఈ స్థాయి క్రేజ్ ఏర్పడింది. దానికి తోడు అక్కినేని నాగార్జున ఇందులో మెయిన్ విలన్ క్యారక్టర్ చేయడం ఈ చిత్రానికి మరింత హైప్ ని తీసుకొని రావడంలో ఉపయోగపడింది. నాగార్జున తో పాటు కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని చాలా రోజులైనా ఈ చిత్రం ఆగష్టు 14 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే తెలుగు లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మామూలుది కాదు.
ఈ సినిమా విడుదలయ్యే రోజునే ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War 2 Movie) చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాని పట్టించుకునేవాడే కరువయ్యాడు. అందరి చూపు రజనీకాంత్ కూలీ వైపే ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత నాగవంశీ పోటీ పడ్డాడు, కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయనకు దక్కలేదు. ఇక ఇందులో నటించిన నాగార్జున కూడా తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీదా ఈ చిత్రాన్ని కొనుగోలు చెయ్యాలని చూసాడు. కానీ ఇప్పుడు ఆయన పేరు కూడా వినిపించడం లేదు. నిన్న రాత్రి నుండి కుబేర నిర్మాత సునీల్ నారంగ్ మరియు సురేష్ బాబు సంయుక్తంగా కలిసి కొనాలని ఫిక్స్ అయ్యారు. 44 కోట్ల రూపాయలకు (GST తో కలిపి) వీళ్లిద్దరు తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు వార్తలు వినిపించాయి. ఈ వార్త వచ్చిన కొద్దిసేపటికే మరో నిర్మాత ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్నట్టు ప్రచారం జరిగింది.
వేదస్కర మూవీస్ కి ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారట. సురేష్ బాబు మరోసారి తమ మేకర్స్ తో చర్చలు జరిపి ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. అందుకోసం దగ్గుబాటి రానా ని కూడా రంగం లోకి దింపినట్టు తెలుస్తుంది. ఇలా టాలీవుడ్ టాప్ నిర్మాతలు మొత్తం కూలీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ పడుతూ ఉన్నారు. ఎవరికీ ఈ సినిమా రైట్స్ అధికారికంగా దక్కింది అనేది త్వరలోనే తెలియనుంది. అయితే ఈ సినిమాకు జరుగుతున్న ఈ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రజనీకాంత్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డు బిజినెస్ అని అంటున్నారు.