Sreeleela Engagement: హీరోయిన్ శ్రీలీల పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. తాజాగా ఇన్ స్టాలో ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ కావడంతో ఆమె పేరు నెట్టింట తెగ వినిపించేస్తోంది. నటి ఎంగేమెంట్ వార్తల్లో నిజం లేదని సమాచారం. ఏ చిన్న వేడుకనైనా ఆమె ఇంట సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. వచ్చే నెలలో ఆమె పుట్టిన రోజు రానుండడంతో ముందస్తుగా చిన్న వేడుకను నిర్వహించినట్లు సమాచారం. ఈ పొటోలపై క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.