Balakrishna: బాలకృష్ణ నటించిన లేటేస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. మాస్ మసాలాను దట్టంగా అందించి, ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించే బాలయ్య చాలా రోజుల తరువాత సెంటిమెంట్ సినిమాలో నటించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయినరోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సెంటిమెంట్ గా వచ్చిన ఈ సినిమాలో పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో తాజాగా కొత్త సాంగ్ ను యాడ్ చేశారు. ఆ సాంగ్ బాలకృష్ణ నటించిన సూపర్ హిట్టు సినిమాలోనిదే. ఆ సాంగ్ కు బాలకృష్ణ తో పాటు కాజల్, శ్రీలీల మాస్ డ్యాన్స్ చేశారు.
బాలకృష్ణ హీరోగా వచ్చిన మంగమ్మ గారి మనువడు 1984 సెప్టెంబర్ 7న రిలీజ్ అయింది. భారతిరాజా కథ అందించగా కోడి రామకృష్ణ సినిమాకు డైరెక్షన్ చేశారు. భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ పై వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇందులో బాలకృష్ణకు తోడుగా భానుమతి రామకృష్ణ, సుహాసిని నటించారు. ఫ్యామిలీ మూవీగా ఆకట్టుకున్న ఈ చిత్రం బాలకృష్ణ కు తొలి 100 రోజులు అందించిన చిత్రంగా నిలిచింది.
ఇందులోని సాంగ్స్ బంపర్ హిట్టుగా నిలిచాయి. ముఖ్యంగా ఇందులో దంచవే మేనత్త కూతురా.. అనే సాంగ్ ఇప్పకిటీ శ్రోతలను అలరిస్తుంది. కేవీ మహదేవన్ మ్యూజిక్ డైరెక్షన్లో ‘దంచవే మేనత్త కూతురా’ అనే సాంగ్ ను బాలసుబ్రహ్మణ్యం పాడారు. 4 నిమిషాల పాటు ఉన్న ఈ సాంగ్ నేటి కుర్రకారును కూడా ఊర్రూతలూగిస్తుంది. అందుకే ఈ సాంగ్ ను బాలకృష్ణ లేటేస్ట్ మూవీ భగవంత్ కేసరిలో ముందుగా పెట్టారు.
అయితే ఈ సాంగ్ మిగతా వాటిని డామినేట్ చేస్తుందనే ఉద్దేశంతో తీసేశారు. కానీ ఆ తరువాత ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆ సాంగ్ పెట్టాలని కోరారు. దీంతో ఫ్యాన్ష్ కోరిక మేరకు ఆ సాంగ్ ను మళ్లీ యాడ్ చేస్తున్నట్లు ఇటీవల జరిగిన ఈ సినిమా ఫంక్షన్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఈ సాంగ్ ను యాడ్ చేశారు. ఇందులో బాలకృష్ణ తో పాటు కాజల్ మాస్ స్టెప్పులు వేశారు. ఇక శ్రీలీల అయితే డ్యాన్స్ తో ఇరగీసిందనే చెప్పొచ్చు. ఈ సాంగ్ ను చూడడానికి ఫ్యాన్స్ మరోసారి థియేటర్లోకి పరుగులు పెడుతున్నారు.
Mass song of #BhagavanthKesari
pic.twitter.com/HkijEZED96— Manikrishna Navuluri (@Maninavuluri) October 24, 2023
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More