గాన గంధర్వుడి ఆరోగ్యం అత్యంత విషమం !

సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిన్న రాత్రి అత్యంత విషమంగా మారిందనే విషయం బయటకు రావడంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా ప్రస్తుతం తీవ్ర ఆందోళనకరంగా ఉంది. బాలుగారి ఆరోగ్యం విషమించినట్లు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులు తాజాగా విడుదల చేసిన అప్ డేట్ అందర్నీ షాక్ కి గురి చేసింది. నిన్న ఉదయమే కదా.. బాలుగారు ఆరోగ్యం కుదుటపడిందని, తరచూ స్పృహలోకి వస్తున్నారని, మరికొద్ది రోజుల చికిత్స తర్వాత […]

Written By: admin, Updated On : August 18, 2020 10:51 am
Follow us on


సినీ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిన్న రాత్రి అత్యంత విషమంగా మారిందనే విషయం బయటకు రావడంతో ఆయన అభిమానులతో పాటు యావత్తు సినీ లోకమంతా ప్రస్తుతం తీవ్ర ఆందోళనకరంగా ఉంది. బాలుగారి ఆరోగ్యం విషమించినట్లు చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులు తాజాగా విడుదల చేసిన అప్ డేట్ అందర్నీ షాక్ కి గురి చేసింది. నిన్న ఉదయమే కదా.. బాలుగారు ఆరోగ్యం కుదుటపడిందని, తరచూ స్పృహలోకి వస్తున్నారని, మరికొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన పూర్తిగా కోలుకుంటారని.. బాలుగారి కుమారుడు చరణ్‌ నిన్న ఉదయం ఓ వీడియో విడుదల చేస్తూ స్పష్టం చేశారు.

Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

మరి అంతలోనే ఏమైంది.. ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో గత 10 రోజులుగా కరోనా చికిత్స పొందుతున్న బాలుగారి ఆరోగ్యం పై ప్రముఖుల సైతం తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. సోషల్ మీడియాలో సైతం గెట్ వెల్ సూన్ ఎస్పీ బాలు అనే హ్యాష్‌ట్యాగ్ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతూనే ఉంది. ఇక బాలుగారి లక్షలాది అభిమానులు ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నారు. బాలు మళ్లీ అదే స్వరంతో.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మార్మోగిపోతున్న కోట్లాది గొంతుకుల చప్పుడుకైనా ఆయన పూర్తిగా కోలుకుంటారు.

Also Read: బన్నీ మూవీలో సాహో భామ ఐటం సాంగ్‌?

నిన్న ఉదయం బాలుగారు ఆరోగ్యం కుదటపడిందని తెలిసిన వెంటనే తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తో పాటు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ తదితరులు నిన్న తమ సంతోషాన్ని వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. కానీ రాత్రి నుండి బాలసుబ్రహ్మణ్యంగారికి ప్రాణరక్షణ పరికరాల సాయంతోనే చికిత్స కొనసాగిస్తున్నామని ఎంజీఎం హెల్త్‌కేర్‌ నుండి బులిటెన్‌ విడుదల కావడంతో అందరూ ఆందోళనలో ఉన్నారు. బలుగారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిద్దాం.