https://oktelugu.com/

బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

ఈ ఉదయం ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ నుండి మరో పాన్ ఇండియా సినిమా రాబోతుందని స్వయంగా ప్రభాస్ టీమ్ స్పష్టం చేయడంతో పాటు పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించడంతో ఇక ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. నిజానికి గత కొన్ని రోజుల నుంచే ఈ సినిమా గురించి రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ రూమర్స్ ను నిజం చేస్తూ… చిత్రబృందం బిగ్ అనౌన్స్ మెంట్ […]

Written By:
  • admin
  • , Updated On : August 18, 2020 / 10:32 AM IST
    Follow us on


    ఈ ఉదయం ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ప్రభాస్ నుండి మరో పాన్ ఇండియా సినిమా రాబోతుందని స్వయంగా ప్రభాస్ టీమ్ స్పష్టం చేయడంతో పాటు పోస్టర్ ను కూడా రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించడంతో ఇక ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. నిజానికి గత కొన్ని రోజుల నుంచే ఈ సినిమా గురించి రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ రూమర్స్ ను నిజం చేస్తూ… చిత్రబృందం బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. హిందీ సినిమా “తనాజీ” దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ “ఆదిపురుష్” అనే మారో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

    Also Read: బన్నీ మూవీలో సాహో భామ ఐటం సాంగ్‌?

    ఈ మేరకు ప్రభాస్ టీమ్ రిలీజ్ చేసిన సినిమా పోస్టర్ కూడా చాలా కొత్తగా అనిపించింది. “A” అనే అక్షరాన్ని హైలైట్ చేస్తూ అందులో హనుమాన్, అలాగే విల్లు పట్టుకొని ఉన్న రాముడు, మరియు పరుశురాముడు, ఇక కింద పది తలల రావణునిలా ఉన్న మరో ఇంట్రస్టింగ్ డిజైన్.. మొత్తానికి ఈ పోస్టర్ ఇండియన్ సినిమా స్థాయిని పెంచే స్థాయిలో డిజైన్ చేశారు. సినిమా కూడా పోస్టర్ కి తగ్గట్లుగానే ఉంటుంది అన్నట్లు మేకర్స్ సింబాలిక్ గా చెప్పారు. పైగా పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ టోన్ కూడా బాగుంది. అన్నట్లు ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మరియు మళయాళ భాషలలో తెరకెక్కించనుండగా.. జపాన్, చైనా లాంటి దేశాల్లో అనువాదం కానుంది. గుల్షన్ కుమార్ మరియు టి సిరీస్ వారు సంయుక్తంగా భారీగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ కు రైటర్ రాజమౌళి భార్య.. మరి సాయి మాధవ్‌? 

    కాగా ప్రస్తుతం ప్రభాస్ తన తర్వాతి చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా కూడా అన్ని ప్రధాన భాషలతో పాటు జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా విడుదల కానుంది. అందుకే ఈ సినిమా కోసం అంతర్జాతీయ సాంకేతిక బృందాన్ని పెట్టుకుంటున్నారు. విఎఫ్ఎక్స్ వర్క్ కి సంబందించిన వర్క్ ను కూడా విదేశాల్లోనే చేయించాలని డిసైడ్ అయ్యారు. ఇక తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్, ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆ స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు.