https://oktelugu.com/

మల్టీస్టారర్ రాక పై ఫేక్ రూమర్స్ !

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న వార్త.. నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ ‘వి’ చిత్రం ఓటిటిలోకి రాబోతుందని. ఈ వార్త పై నిజం ఉందో లేదో తెలియకుండానే రూమర్స్ ను జనం మీదకు తెగ వదిలేస్తున్నారు రాతల రాయుళ్లు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రూమర్లలో కనీస నిజం కూడా లేదని తెలుస్తోంది. నిజానికి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ […]

Written By:
  • admin
  • , Updated On : August 18, 2020 / 11:09 AM IST
    Follow us on


    గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న వార్త.. నేచురల్ స్టార్ నాని – సుధీర్ బాబు కలయికలో రాబోతున్న మల్టీస్టారర్ ‘వి’ చిత్రం ఓటిటిలోకి రాబోతుందని. ఈ వార్త పై నిజం ఉందో లేదో తెలియకుండానే రూమర్స్ ను జనం మీదకు తెగ వదిలేస్తున్నారు రాతల రాయుళ్లు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ రూమర్లలో కనీస నిజం కూడా లేదని తెలుస్తోంది. నిజానికి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ఈ సినిమాకి భారీ మొత్తం ఆపర్ చేసినా ‘వి’ మూవీ మేకర్స్ మాత్రం ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. నేరుగా థియేటర్ ల్లో రిలీజ్ చేసి… ఆ తరువాత డిజిటల్ రైట్స్ ను అమ్ముకోవచ్చు అనేది మేకర్స్ ప్లాన్.

    Also Read: బ్రేకింగ్ : ‘ప్రభాస్’ నుండి బిగ్ అనౌన్స్ మెంట్ !

    అప్పుడు థియేటర్ల రెవిన్యూతో పాటు డిజిటల్, శాటిలైట్ రైట్స్ కు అదనంగా డబ్బులు వస్తాయి. అదే నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే.. థియేటర్ల రెవిన్యూని పోగొట్టుకున్నట్టే. అందుకే ఎంత భారీ ఆఫర్ వచ్చినా.. మేకర్స్ మాత్రం కమిట్ అవ్వట్లేదు. ఇక ఈ సినిమా కథకు ముగింపు లేదని.. అంటే సినిమా ముగిసిన చోట నుండే మరో కొత్త కథ స్టార్ట్ అయ్యేలా ఇంద్రగంటి తన కథను రాసుకున్నాడని తెలుస్తోంది. బహుశా ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన ఇంద్రగంటికి ఉండి ఉండొచ్చు. కానీ అది సాధ్యం అయ్యే పనేనా. ఇప్పటికే నాని, సుధీర్ బాబుల మధ్య ఇగో సమస్యలు వచ్చాయని.. అందుకే సినిమా ప్రమోషన్స్ లో కూడా సుధీర్ బాబు కనిపించట్లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో ‘వి’ సినిమాకి సీక్వెల్ ఉండటానికి అవకాశం ఉన్నా నాని – సుధీర్ బాబు మళ్ళీ కలిసి పని చేస్తారా అంటే.. చెప్పలేం.

    Also Read: బన్నీ మూవీలో సాహో భామ ఐటం సాంగ్‌?

    ఒకవేళ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే, సీక్వెల్ పై భారీ అంచనాలు ఉంటే.. అప్పుడు హీరోలు మళ్ళీ కలిసి పని చేసే అవకాశం ఉంటుంది. నువ్వా ? నేనా? అనేలా ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్స్ చేసిన నాని, సుధీర్ బాబు మళ్ళీ కలిసి హ్యాపీగా పని చేస్తారు. ఏమైనా ఈ సినిమాలో.. నటనలో నాని డామినేట్ చేసినా.. యాక్షన్ సీక్వెన్స్ లో మాత్రం సుధీర్ బాబునే డామినేట్ చేస్తాడని.. సినిమాలో ఇద్దరి హీరోల పాత్రలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని తెలుస్తోంది. ఇంద్రగంటి అంటేనే వైవిధ్యం.. దానికి తోడు తన హీరోలను చాలా సహజంగా చూపిస్తాడనే నేమ్ ఉంది. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. నిర్మాత దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా రానుంది.