SonuSood: బాలీవుడ్ స్టార్ నటుడు సోనూసూద్ హీరోగా కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు విలన్‌గా మాత్రమే కనిపించిన సోనూ.. కొత్త సినిమాతో హీరోగా వస్తున్నాడు. జీ స్టూడియోస్ తాజాగా తన తదుపరి యాక్షన్ చిత్రాన్ని ప్రటించింది. ఫతే టైటిల్‌తో రానున్న ఈ సినిమాలో సోనూ సూద్ హీరోగా కనిపించనున్నారు. అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తోన్నఈ సినమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో సోను సూద్‌ను మునుపెన్నడు చూడని విభిన్న పాత్రలో చూడబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ముఖ్యంగా అబ్బురపరిచే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయట. జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
కాగా, కరోనా కాలంలో ఎంతో మంది పేద ప్రజలకు సాయంగా ఉంటూ సూపర్‌హీరోగా మారిపోయారు. ఇప్పటికే కొన్ని వేల మందికి అండగా నిలిచి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పటికీ సాయమని అడిగిన వారికి లేదనకుండా చేయి అందిస్తున్నారు. కాగా, సోనూ చివరగా రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ సింబాలో కనిపించారు. ఇప్పటి వరకు రియల్ లైఫ్ హీరోగా గుర్తంపు పొందిన సోనూ.. సినిమాలోనూ హీరోగా కనిపించేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటి వరకు విలన్‌గానే కనిపించిన సోనూను హీరోగా ఎలా ఆదరిస్తారో చూడాలి.