spot_img
Homeఎంటర్టైన్మెంట్కలియుగ కర్ణుడికి మరో అరుదైన గౌరవం !

కలియుగ కర్ణుడికి మరో అరుదైన గౌరవం !

Sonu Sood
కలియుగ కర్ణుడు ‘సోనూసూద్’కి విగ్రహం ఏర్పాటు చేసి పూజించడం గురించి విన్నాం.. ఇటీవలే ‘అల్లుడు అదుర్స్’ సెట్లో నటుడు ప్రకాష్ రాజ్ సోనూసూద్‌ను శాలువా కప్పి సన్మానించడం చూసాం, అలాగే ‘ఆచార్య’ సెట్లోనూ ఆయనకు సత్కారం జరిగిన విషయం కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు తాజాగా ‘హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డును సోనూ అందుకోబోతున్నారని గర్వంగా చెప్పుకోబోతున్నాం. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్ నార్వే చేత ఈ గౌరవాన్ని పొందబోతున్నాడు ఈ రియల్ హీరో. నిజంగా కరోనా లాక్ డౌన్ సమయంలో నటుడు సోనూ సూద్ చేసిన సేవా కార్యక్రమాలను దేశం మొత్తం కొనియాడింది.

Also Read: మహేష్ బాబు కోసం నలుగురి మధ్య పోటీ !

ముఖ్యంగా పనులు లేక ఇళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న కొన్ని వందల మంది కూలీలను సొంత ఖర్చులరో బస్సులు ఏర్పాటుచేసి సొంత ఊళ్లకు చేర్చడమే కాకుండా వారికీ ఆర్ధిక సాయం కూడా చేసినట్టు తెలుస్తోంది. అలాగే అనేక మందికి భోజన వసతిని కల్పించారు. ప్రధాని సహా అనేకమంది రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు సోనూ సూద్ సేవలను కొనియాడారంటేనే ఆయన గొప్పతనాన్ని అర్ధం చేసుకోవచ్చు. అన్నట్టు మన తెలుగు సెలబ్రిటీలైతే సోనూసూద్‌ చేసిన సేవలకు గాను ఆయనకు సత్కారాలు, సన్మానాలు చేస్తూ తమ వాడే అంటూ గొప్పలు పోతున్నారు.

Also Read: ఆ ఫ్యామిలిలో కరోనా ‘మెగా’ టెన్షన్‌

నిజంగా ఒక విలన్ గా నటించిన నటుడికి ఈ జనరేషన్ లో ఈ రేంజ్ గౌరవం బహుశా మరో నటుడికి దక్కలేదనే చెప్పాలి. ఏది ఏమైనా ఎక్కడో చైనా నుండి కరోనా మహమ్మారి దావానలంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది, సమస్త మానవ జాతిని ముప్పు తిప్పలు పెడుతూ దొరికిన వారిని దొరికినట్టుగా పొట్టన పెట్టుకుంటూ దేశ స్థితి గతులని అస్తవ్యస్తం చేస్తున్న తరుణంలో సోనూసూద్ లాంటి వ్యక్తి ఇలా కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయడం విశేషమైన గొప్ప విషయమే. ఒక్క మాటలో చెప్పాలంటే “కలియుగ కర్ణుడు” మాదిరి దాన ధర్మాలు చేశారు సోను సూద్.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version