https://oktelugu.com/

బుమ్రా అరుదైన రికార్డు.. కుంబ్లే సరసన చేరాడు..!

ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీం ఇండియా ట్వీ-20 మ్యాచుల తర్వాత టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది. మొదటి టెస్టులో టీం ఇండియా దారుణంగా ఓటమిపాలైంది. దీంతో క్రికెట్ ప్రియులు.. మాజీ క్రికెటర్ల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ భారత్ దే మాజీ క్రికెటర్.. డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరంద్ర సెహ్వాగ్ మొదటి టెస్టులో టీంఇండియా రెండో ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్లను ఓటీటీతో పోల్చడం వైరల్ అయింది. ఈక్రమంలోనే ఆస్ట్రేలియాతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 29, 2020 / 12:55 PM IST
    Follow us on

    ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్న టీం ఇండియా ట్వీ-20 మ్యాచుల తర్వాత టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది. మొదటి టెస్టులో టీం ఇండియా దారుణంగా ఓటమిపాలైంది. దీంతో క్రికెట్ ప్రియులు.. మాజీ క్రికెటర్ల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

    Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ భారత్ దే

    మాజీ క్రికెటర్.. డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరంద్ర సెహ్వాగ్ మొదటి టెస్టులో టీంఇండియా రెండో ఇన్నింగ్స్ లో చేసిన స్కోర్లను ఓటీటీతో పోల్చడం వైరల్ అయింది. ఈక్రమంలోనే ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత క్రికెటర్లు సమస్టిగా రాణించడంతో టీంఇండియా ఘన విజయం సాధించింది.

    ఇక ఇదే మ్యాచ్ లో భారత బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు నమోదు చేశాడు. మెల్‌బోర్న్ గ్రౌండ్లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్ల పేర్లను అక్కడ ఉన్న బోర్డు పైకి ఎక్కించడం ఆనవాయితీగా వస్తోంది.

    Also Read: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. భారత్ లక్ష్యం 70.. ప్రస్తుతం 33/2

    ఈక్రమంలోనే చివరిసారి భారత్ అక్కడ మ్యాచ్ ఆడినప్పుడు బుమ్రా ఒక్క ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సాధించాడు. ఇక తాజాగా మొత్తం తొమ్మిది వికెట్లను పడగొట్టాడు.

    ఈ గ్రౌండ్లో మొత్తం 15వికెట్లు తీయడంతో బుమ్రా కొత్త రికార్డు సృష్టించాడు. గతంలో అనిల్ కుంబ్లే మెల్ బోర్న్ లో 15వికెట్లు తీశాడు. దీంతో కుండ్లే సరసన బుమ్రా నిలిచాడు. కాగా భారత్ రెండో ఇన్నింగ్స్ లో 8వికెట్లతో తేడా ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది.