Mahesh Babu
Mahesh Babu: టాలీవుడ్ బడా స్టార్స్ లో మహేష్ బాబు ఒకరు. టాక్ తో సంబంధం లేకుండా మహేష్ బాబు చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు పరిశ్రమలో అడుగుపెట్టారు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. మహేష్ బాబుకు పరిశ్రమలో వివాదరహితుడిగా పేరుంది. సినిమా తర్వాత కుటుంబమే ఆయన ప్రపంచం. ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులకు కేటాయిస్తారు. భార్య నమ్రత శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో తరచుగా వెకేషన్స్ కి వెళుతూ ఉంటారు. మహేష్ బాబు గొప్ప భర్త, తండ్రి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
మహేష్ బాబును అభిమానులు ప్రేమించడానికి ఆయన వ్యక్తిత్వం కూడా ఒక కారణం. ఆయన సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. రెండు గ్రామాలు దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరిట వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించాడు. తాను చేస్తున్న ఈ సహాయాన్ని మహేష్ బాబు ఎన్నడూ బహిరంగంగా చెప్పింది. చేయాలనుకున్న మంచి ప్రచార ఆర్భాటం లేకుండా కొనసాగించారు. మెల్లగా ఆ విషయం వెలుగులోకి వచ్చింది.
sonali bendre
ఇంతటి మంచితనం ఉన్న మహేష్ బాబు ఒక స్టార్ హీరోయిన్ ని సెట్ లో ఏడిపించాడు అంటే నమ్మడం కష్టమే. కానీ ఇదే నిజం అట. మహేష్ బాబు కెరీర్ బిగినింగ్ చేసిన మురారి సూపర్ హిట్. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మురారి మూవీలో సోనాలీ బింద్రే హీరోయిన్ గా నటించింది. బావ మరదళ్ళుగా మహేష్ బాబు, సోనాలి బింద్రే నటన ఆకట్టుకుంటుంది. కాగా ఈ సినిమాలో సోనాలీ బింద్రేను మహేష్ బాబు ఆటపట్టిస్తూ ఉంటాడు.
అయితే డైరెక్టర్ చెప్పిన దానికి మించి సోనాలీ బింద్రేను మహేష్ బాబు ఆట పట్టించేవారట. ఈ విషయాన్ని ఓ పాత్ర చేసిన నటి సుధ వెల్లడించారు. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు తీరుకు సోనాలీ బింద్రే ఏడ్చేసినంత పని చేసిందట. షాట్ అయ్యాక.. మహేష్ బాబు, సుధల వద్దకు వచ్చిన సోనాలీ బింద్రే కావాలని నన్ను ఏడిపిస్తున్నారు కదా.. అని అడిగేసిందట. దానికి సుధ, మహేష్ బాబు నవ్వారట. అయితే ఇదంతా సరదా కోసమే. మహేష్ బాబు ఉద్దేశపూర్వకంగా సోనాలీ బింద్రేను ఏడిపించలేదని సుధ వెల్లడించారు.
మురారీ సినిమా షూటింగ్ ని ఆద్యంతం ఆస్వాదించినట్లు ఆమె గుర్తు చేసుకున్నారు. మురారీ సోనాలీ బింద్రేకు తెలుగులో మంచి బ్రేక్ ఇచ్చింది. అనంతరం ఆమె మన్మధుడు, ఇంద్ర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఆ మధ్య క్యాన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే, మహమ్మారిని గెలిచి, తిరిగి మామూలు మనిషి అయ్యారు.
Web Title: Sonali bendre made interesting comments about mahesh babu
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com