Jabardasth Pavithra: ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు పవిత్ర. ఈమె ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో లోనూ ఉంటుంది. తనదైన మార్క్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. సోషల్ మీడియా లో కూడా ఈమె నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది పవిత్ర. అయితే ఎప్పుడు నవ్వుతూ, అందరినీ నవ్వించే పవిత్ర , నిజ జీవితం లో మాత్రం చాలా ఎన్నో బాధలను ఎదురుకున్నది. రీసెంట్ గా ఈమె ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఒక వీడియో ద్వారా , తన నిశ్చితార్థం ని బ్రేక్ చేసుకున్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఆమె పడిన బాధని చూసిన తర్వాత , ఇంత బాధని మనసులో పెట్టుకొని వినోదాన్ని ఎలా పంచుతుంది అని అనిపించక తప్పదు.
ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు ఎక్కడా చెప్పుకొని ఒక విషయాన్ని మీతో చెప్పుకోబోతున్నాను. ఇది నా గత లవ్ స్టోరీ. నేను నిజంగా అతన్ని ఎంతో గాఢంగా ప్రేమించాను. అతనితో ఉన్నంత కాలం నా జీవితం చాలా బాగా అనిపించింది. కానీ నెమ్మదిగా ఆ బంధం బలహీనపడుతూ వచ్చింది. మా మధ్య ఎన్నో ఫైట్స్ జరిగాయి, ఒకరిని ఒకరు అవమానించుకున్నాము. కొన్ని సందర్భాల్లో బూతులు కూడా తిట్టుకున్నాము. కానీ ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతోంది, జరిగిన దాంట్లో తప్పు మొత్తం నాదే అని తెలుసుకున్నాను. నేను అతన్ని బూతులు తిట్టాను అనే విషయాన్ని ఇప్పుడు తల్చుకుంటే నాకు చాలా బాధ వేస్తోంది. దానిని బూతులు అంటరాని కూడా నాకు తెలియదు. అయితే కాలం గడిచే కొద్దీ నా తప్పేమి లేదని అనిపించింది. అయినప్పటికీ అతన్ని గాఢంగా ప్రేమించాను కాబట్టి , ఏడాది వరకు సహించాను’.
‘ఇక ఆ తర్వాత నేను అర్థం చేసుకుంది ఏమిటంటే , అతను నా జీవితం లో లేకపోవడమే బాగుండు అని. ప్రతీ రోజు నేను ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో అర్థమైంది. అప్పట్లో నేను అతన్ని బూతులు తిట్టడం లో తప్పులేదని అనిపించింది. ఇక ఆ తర్వాత అతనితో నిశ్చితార్దాన్ని రద్దు చేసుకున్నాను. ఇది నేనేదో సానుభూతి పొందేందుకు చెప్పడం లేదు. నాలాగా ఇబ్బంది పడేవాళ్ళకు చెప్తున్నాను. ప్రేమ అనేది మన మానసిక ప్రశాంతతని, ఆత్మాభిమానాన్ని నొప్పించేలా ఉండకూడదు. ఎవరిని ఎంత ప్రేమించినా , మనం మనల్ని కోల్పోయే చోట అసలు ఉండకూడదు. ఈరోజు నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు గర్వపడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది పవిత్ర.
View this post on Instagram