Tamannaah Bhatia : ప్రముఖ హీరోయిన్ తమన్నా(Tamannaah Bhatia) తన ప్రియుడు విజయ్ వర్మ(Vijay Varma) తో బ్రేకప్ చేసుకుందని చాలా రోజుల నుండి సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీళ్లిద్దరు రవీనా తాండన్ నిర్వహించిన హోలీ సెలెబ్రేషన్స్ లో పాల్గొన్నారు, కానీ కలిసి కాదు, విడివిడిగా పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్లినా కలిసి జంటగా వెళ్లే ఈ ఇద్దరు, ఇలా విడివిడిగా వెళ్లడంతో వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్తకు బలం చేకూరింది. అయితే కొంతమంది లో వీళ్లిద్దరు విడిపోయారు అంటే నమ్మలేకపొతున్నారు. ఎందుకంటే అలాంటి సూచనలు ఇస్తుంది తమన్నా. గతంలో ఆమె విజయ్ వర్మ తో కలిసి అనేక ఫోటోలు దిగింది. ఆ ఫోటోలలో విజయ్ ఒక కోటుని ధరించి ఉన్నాడు. సరిగ్గా అదే తరహా కోటుని తమన్నా రీసెంట్ గా దిగిన ఫోటోలలో ధరించింది. అంటే ప్రియుడి కోటుని ధరించింది అన్నమాట.
Also Read : హోలీ వేడుకల్లో తమన్నా, విజయ్ వర్మ.. బ్రేకప్ రూమర్స్ కి చెక్ పడినట్టేనా!
దీని అర్థం ఏమిటి?, వీళ్ళిద్దరూ ఇప్పటికీ కలిసే ఉన్నారా?, కలిసి లేకుంటే తన మాజీ ప్రియుడి కోటుని ధరించాల్సిన అవసరం తమన్నా కి ఏముంది అని అంటున్నారు నెటిజెన్స్. ఒకవేళ తమన్నా కోటునే విజయ్ వర్మ అప్పట్లో ధరించి ఉండొచ్చు, ఇద్దరు విడిపోయారు కాబట్టి, ఎవరి వస్తువులు వాళ్ళు తిరిగి తీసుకొని ఉండొచ్చు అంటూ విశ్లేషిస్తున్నారు నెటిజెన్స్. ఏది ఏమైనా వీళ్లిద్దరు విడిపోయారు అనేదానికి ఆధారాలు ఎక్కువగా ఉన్నాయి. తమన్నా విజయ్ ని ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో అవ్వడం, అతనితో కలిసి దిగిన ఫొటోలన్నీ వరుసగా డిలీట్ చేయడం, ఇద్దరు వేరువేరుగా ఒకే ఈవెంట్ కి రావడం వంటివి ఉదాహరణలు. సుదీర్ఘ డేటింగ్ తర్వాత తమన్నా కి విజయ్ వర్మ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అయినప్పటికీ, విజయ్ వర్మ కి మాత్రం ఇష్టం లేదని, అందుకే వీళ్లిద్దరు విడిపోయారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.
ఇక పెళ్లిని దృష్టిలో పెట్టుకొని తమన్నా ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ని రిజెక్ట్ చేసింది. ఇక నుండి ఆమె మళ్ళీ తన కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టే పనిలో ఉందట. ప్రస్తుతం ఆమె చేతులో ‘ఓదెల 2′(Odela 2 Movie) అనే చిత్రం ఉంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ నేచురల్ పవర్స్ జానర్ సినిమాలో తమన్నా లేడీ మాంత్రికురాలిగా కనిపించనుంది. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ రైట్స్ ఇటీవలే మంచి రేటుకి అమ్ముడుపోయింది. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ చిత్రాన్ని 11 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా, హిందీ డబ్బింగ్ రైట్స్ 6 కోట్ల 50 లక్షలకు అమ్ముడుపోయింది. అదే విధంగా సాటిలైట్ రైట్స్ అన్ని భాషలకు కలిపి మరో పది కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ఉంటుందని, ఓవరాల్ గా ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ తో రాబట్టేసిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : ప్రియుడితో బ్రేకప్ తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న తమన్నా..కానీ ఇప్పటికే పరిస్థితులు చెయ్యి దాటిపోయాయి!