https://oktelugu.com/

అరె.. తమిళ స్టార్ కి తెలుగు పిచ్చి పట్టిందట !

హీరో ధనుష్ కు తెలుగు పిచ్చి పట్టుకుంది అంటూ అతని పై తమిళ మీడియా సెటైర్లు వేస్తూ అనేక విమర్శలు చేస్తూ ఉంది ప్రస్తుతం. కారణం ధనుష్ ఏరి కోరి ఇప్పటికే తెలుగులో ఒక మూవీ సైన్ చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కాకపోతే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ మూవీకి ఈ ఏడాది చివర్లో ముహూర్తం కూడా సెట్ చేశారని టాక్. అయితే […]

Written By: , Updated On : June 26, 2021 / 01:22 PM IST
Follow us on

Dhanushహీరో ధనుష్ కు తెలుగు పిచ్చి పట్టుకుంది అంటూ అతని పై తమిళ మీడియా సెటైర్లు వేస్తూ అనేక విమర్శలు చేస్తూ ఉంది ప్రస్తుతం. కారణం ధనుష్ ఏరి కోరి ఇప్పటికే తెలుగులో ఒక మూవీ సైన్ చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. కాకపోతే తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ మూవీకి ఈ ఏడాది చివర్లో ముహూర్తం కూడా సెట్ చేశారని టాక్.

అయితే తాజాగా ధనుష్ ఇంకో డైరెక్ట్ తెలుగు సినిమా కూడా సైన్ చేసే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార సంస్థ’ ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేసే పనిలో ఉందని, ఇప్పటికే ధనుష్ కి భారీ పారితోషికం ఆఫర్ చేసిందని.. ధనుష్ కూడా కథ బాగుంటే చేద్దాం అని అభయ హస్తం ఇచ్చాడని ఆ వార్త సారాంశం.

దాంతో తమిళ మీడియా ధనుష్ పై విరుచుకు పడుతూ ఇలా వరుసగా తెలుగు సినిమాలు చేయడం ఏమిటి ? తమిళ భాషలో సినిమాలు చేయాలి గానీ, ఇలా పక్క బాష పై మమకారం పెంచుకుంటూ మాతృభాషను అశ్రద్ధ చేస్తే సహించం అంటూ ధనుష్ పై తమిళ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ బయట వ్యక్తులకు ఆశ్చర్యాన్ని కలిగించొచ్చు.

కానీ, ఆరవ సమాజంలోని ఫీలింగ్స్ గురించి అవగాహన ఉంటే.. ఇలాంటి కామెంట్స్ వాళ్లకు సర్వసాధారణమైన విషయం అని అర్ధం అవుతుంది. ఇంతకీ, ఈ సినిమా సెట్ అవ్వాలి అంటే, ధనుష్ కి నచ్చే కథ చెప్పాలి. ప్రస్తుతం ధనుష్ కోసం స్క్రిప్ట్ లను వింటుంది సితార సంస్థ. యువ దర్శకుడు భరత్ చెప్పిన స్క్రిప్ట్ సితార సంస్థకు బాగా నచ్చింది అట.

కాకపోతే ఆ దర్శకుడికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో లేదు సదరు సంస్థ. కేవలం కథను మాత్రమే తీసుకుని, వేరే స్టార్ దర్శకుడితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తోంది. మరి ఆ కొత్త దర్శకుడు ఇందుకు ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.