ఆఫ్రికా దేశాల్లో మళ్లీ భయం? విస్తరిస్తున్న డెల్టా వేరియంట్

ప్రపంచంలో కరోనా మహమ్మారి రెండో దశను మరిచిపోకముందే మూడో దశ కదలికలు అప్పుడే కనిపిస్తున్నాయి. ఆస్ర్టేలియా, ఇజ్రాయెల్ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసిన కట్టడి చేసినా కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. అప్రమత్తమైన రెండు దేశాల్లో మరోసారి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ విధించాయి. డెల్టా వేరియంట్ ఆఫ్ఱికా దేశాల్లో ప్రళయం సృష్టిస్తున్న సందర్భంలో భారత్ కూడా వణికిపోతోంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యధిక టీకాలు వేసిన దేశంగా […]

Written By: Srinivas, Updated On : June 26, 2021 5:08 pm
Follow us on

ప్రపంచంలో కరోనా మహమ్మారి రెండో దశను మరిచిపోకముందే మూడో దశ కదలికలు అప్పుడే కనిపిస్తున్నాయి. ఆస్ర్టేలియా, ఇజ్రాయెల్ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసిన కట్టడి చేసినా కొత్తగా వచ్చిన డెల్టా వేరియంట్ విజృంభిస్తోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. అప్రమత్తమైన రెండు దేశాల్లో మరోసారి ఆంక్షలు అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ విధించాయి.

డెల్టా వేరియంట్ ఆఫ్ఱికా దేశాల్లో ప్రళయం సృష్టిస్తున్న సందర్భంలో భారత్ కూడా వణికిపోతోంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అత్యధిక టీకాలు వేసిన దేశంగా ప్రసిద్ధిపొందింది. వైరస్ వ్యాప్తిని అదుపులోకి తెచ్చేందుకు విరామం లేకుండా శ్రమించింది. ఈ నేపథ్యంలో ఇండోర్ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

కానీ నాలుగు రోజులకే నిత్యం వంద కేసులు బయటపడడంతో భయం నెలకొంది. గురువారం ఒక్కరోజే 227 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ మాస్కుల నిబంధన సడలింపును ఎత్తేసింది. ఇండోర్ ప్రాంతంలో మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందని తేల్చింది. దేశంలో వైరస్ విజృంభన డెల్టా వేరియంట్ కారణం కావచ్చని ఇజ్రాయెల్ లో కరోనాపై ఏర్పాుటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ చీఫ్ పేర్కొన్నారు.

కరోనా మూడో దశతో సమస్యలు ఎదురవువుతున్నాయి. ఇప్పటివరకు 14 దేశాల్లో డెల్టా వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంది. గడిచిన మూడు వారాలుగా వైరస్ విజృంభన ఎక్కువైందని తెలుస్తోంది. ఆఫ్రికా ఖండాన్ని మూడో దశ తాకిందని ఆఫ్రికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్ జాన్ కెంగాసాంగ్ పేర్కొన్నారు.