https://oktelugu.com/

మహారాష్ర్టలో మూడో దశ ప్రారంభమైందా?

దేశంలో అప్పుడే మూడో దశ చాయలు కనిపిస్తున్నాయి. మహారాష్ర్టలో భారీగా కేసులు నమోదవుతుండడంతో థర్డ్ వేవ్ విస్తరిస్తోందని భయం పుట్టుకొస్తోంది. కరోనా మూడో దశలో రాష్ర్టంలో 50 లక్షల మందికి పైగా బారిన పడే సూచనలున్నాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ర్టేషన్ మంత్రి రాజేంద్ర షింగ్నే తెలిపారు. థర్డ్ వేవ్ లో 8 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. సుమరు ఐదు లక్షల మంది చిన్నారులు కూడా కరోనా బారిన పడే […]

Written By: , Updated On : June 26, 2021 / 01:50 PM IST
Follow us on

Corona 3rd waveదేశంలో అప్పుడే మూడో దశ చాయలు కనిపిస్తున్నాయి. మహారాష్ర్టలో భారీగా కేసులు నమోదవుతుండడంతో థర్డ్ వేవ్ విస్తరిస్తోందని భయం పుట్టుకొస్తోంది. కరోనా మూడో దశలో రాష్ర్టంలో 50 లక్షల మందికి పైగా బారిన పడే సూచనలున్నాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ర్టేషన్ మంత్రి రాజేంద్ర షింగ్నే తెలిపారు. థర్డ్ వేవ్ లో 8 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సుమరు ఐదు లక్షల మంది చిన్నారులు కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందన్నారు. వీరిల 2.5 లక్షల మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరతారన్నారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ టాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పరిస్థితిని సమీక్షించామని మంత్రి షింగ్నే పేర్కొన్నారు. థర్డ్ వేవ్ విజృంభనపై రాష్ర్టంలో సదుపాయాలు పెంచనున్నట్లు మంత్రి తెలిపారు.

వైద్య సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. మహారాష్ర్టలో గత కొన్ని వారాలుగా కరోనా కేసులు తగ్గుతున్నా రెండు రోజులుగా పెరుగుతున్నాయి. ఆంక్షల సడలింపులు చేయడంతో జన సంచారం పెరిగి కేసులు కూడా పెరుగుతున్నట్లు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ర్టలో60,17,035 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి.

వీటిలో 57,72,7999 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. కరోనా మహమ్మారి బారిన పడి రాష్ర్టంలో ఇప్పటివరకు 1,20,370 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ర్టంలో 1,20,715 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 4.1 కోట్ల నమూనాలను పరీక్షించారు. మొత్తానికి మహారాష్టలో కరోనా మూడో దశ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.