Mrunal Thakur: సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకున్న ఇమేజ్ నేపథ్యంలో షాక్ అవుతున్నారు. సీతారామం సీతేనా ఇంత దారుణానికి ఒడిగట్టిందని ఆశ్చర్యపోతున్నారు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ స్వయం కృషితో హీరోయిన్ గా ఎదిగారు. బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఆమె మొదటి బాలీవుడ్ చిత్రం లవ్ సోనియా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడింది.

లవ్ సోనియా మూవీతో మృణాల్ కి మంచి పేరొచ్చింది. దాంతో హృతిక్ రోషన్ సూపర్ 30 మూవీలో ఛాన్స్ దక్కింది. సూపర్ 30 మంచి విజయం సాధించింది. అలాగే మృణాల్ హీరోయిన్ గా నటించిన బాట్లా హౌస్ సైతం హిట్ స్టేటస్ దక్కించుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్స్ క్యూ కట్టాయి. కాగా సీతారామం మూవీతో టాలీవుడ్ లో మృణాళి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. సీతారామం భారీ హిట్ కొట్టిన నేపథ్యంలో మృణాల్ పేరు మారుమ్రోగుతుంది. అదే సమయంలో సీత పాత్రలో మృణాల్ మ్యాజిక్ చేశారు. దుల్కర్ తో ఆమె కెమిస్ట్రీ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా కుదిరింది.
సీతారామం చిత్రం మృణాల్ కి తెలుగులో హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ తెచ్చింది. అయితే ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ దీనికి భిన్నంగా ఉన్నాయి. మృణాల్ హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి చూసి తెలుగు జనాలు బిత్తరపోతున్నారు. మృణాల్ అరాచకం అంతటితో ఆగలేదు. టాప్ లెస్ ఫోజులతో నగ్నత్వం తలపిస్తున్న ఫోటోలు షేర్ చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా ఉన్న మృణాల్ ని చూసి సీతారామం సినిమాలో నటించింది నిజంగా ఈమేనా అంటున్నారు. అంత దారుణంగా ఆమె బోల్డ్ ఫొటోస్ ఉన్నాయి.

ఇక తెలుగులో ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. హిందీలో మాత్రం ఆమె దూసుకుపోతున్నారు. ఏకంగా నాలుగు చిత్రాలు ఆమె హీరోయిన్ గా తెరకెక్కుతున్నాయి. కాగా పరిశ్రమకు వచ్చిన కొత్తలో మృణాల్ కి అనేక అవమానాలు ఎదురయ్యాయట. తనని బాడీ షేమింగ్ చేశారట. బుల్లితెర నటి అంటే చీప్ గా చూసేవారట. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మూవీలో మొదట తనను ఎంపిక చేసి తర్వాత తప్పించారని మృణాల్ చెప్పుకొచ్చారు.