https://oktelugu.com/

లైంగిక వేధింపుల కేసులో సింగర్ కి శిక్ష తప్పదా ?

బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్ చాలా మంచి వాడు అని, పద్దతికి మారుపేరు అని ఆయనకు పేరు ఉంది. కానీ, ఆయన పై స్వయానా హనీ సింగ్ భార్య షాలినినే పలు కేసులు పెట్టి షాక్ ఇచ్చింది. అయితే, షాలిని పెట్టిన కేసుల్లో గృహ హింస, లైంగిక వేధింపులు వంటి కేసులు ఉన్నాయి. ఆమె కావాలనే ఇలాంటి కేసులు పెట్టింది అని హనీ సింగ్ సన్నిహితులు చెబుతున్న మాట. కానీ, షాలిని.. తనని హనీ […]

Written By:
  • admin
  • , Updated On : August 4, 2021 / 12:40 PM IST
    Follow us on

    బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీ సింగ్ చాలా మంచి వాడు అని, పద్దతికి మారుపేరు అని ఆయనకు పేరు ఉంది. కానీ, ఆయన పై స్వయానా హనీ సింగ్ భార్య షాలినినే పలు కేసులు పెట్టి షాక్ ఇచ్చింది. అయితే, షాలిని పెట్టిన కేసుల్లో గృహ హింస, లైంగిక వేధింపులు వంటి కేసులు ఉన్నాయి. ఆమె కావాలనే ఇలాంటి కేసులు పెట్టింది అని హనీ సింగ్ సన్నిహితులు చెబుతున్న మాట.

    కానీ, షాలిని.. తనని హనీ సింగ్ ఆర్థికంగా కూడా మోసం చేశాడని కేసు పెట్టింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా ఆమె పోలీసులకు అందించింది. పైగా ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేసింది షాలిని. దాంతో కోర్టు హానీ సింగ్ కు నోటీసులు జారీ చేయడం, ఆగస్టు 28 లోపు సమాధానం చెప్పాలని ఆదేశించడంతో.. ఇప్పుడు హనీ సింగ్ ఆలోచనలో పడ్డాడు.

    మళ్ళీ భార్యతో కాంప్రమైజ్ కావాలని అలోచిస్తున్నాడు. ఇప్పటికే పెద్దలను ఆమె దగ్గరికి రాయబారానికి పంపాడు. కానీ, ఆయన భార్య వెర్షన్ మరోలా ఉంది. పెళ్లి అయిన దగ్గర నుండి హనీ సింగ్ తనను మానసికంగా చాలా హింసించాడు అని, తాగి చాలా సార్లు తనను కొట్టాడు అని, అతన్ని క్షమించే ప్రసక్తే లేదని ఆమె అంటుందట. మరోపక్క ఈ కేసులో హనీ సింగ్ తల్లిదండ్రులు కూడా ఇరుక్కున్నారు.

    వాళ్ళు కూడా తనను అనేక ఇబ్బందులకు గురి చేశారని షాలిని కేసులో పేర్కొంది. పైగా హనీ సింగ్ కు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని కూడా ఆమె కొన్ని సాక్ష్యాలు చూపించినట్లు తెలుస్తోంది. మొత్తానికి షాలిని శాంతించకపోతే, హనీ సింగ్ కు శిక్ష పడే అవకాశం ఉంది. నిజానికి షాలినితో హనీ సింగ్ కు 2011లోనే వివాహం జరిగినా… అతను మాత్రం 2014లో ‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో తన భార్యను జనాలకు పరిచయం చేశాడు. మరీ అప్పటి వరకు భార్యను భార్యగా ఎందుకు గుర్తించలేదో !