ఏపీ అప్పు.. బ్యాంకులకే ముప్పుగా మారిందా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతోంది. ఎడాపెడా అప్పులు చేస్తూ దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మారింది పరిస్థితి. ఏపీకి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ప్రస్తుతం వణికిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను పెట్టి మద్యం పన్ను బదలాయించి దాన్ని ఆదాయంగా చూపించి బ్యాంకుల వద్ద అందినంత మేర అప్పులు చేసింది. ఇందులో మధ్యవర్తిత్వంగా ఎస్ బీఐ క్యాప్ సంస్థ రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం నియమించుకుంది. అయితే బ్యాంకులు మాత్రం ప్రభుత్వం తనఖా పెడుతున్న […]

Written By: Srinivas, Updated On : August 4, 2021 12:34 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోతోంది. ఎడాపెడా అప్పులు చేస్తూ దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మారింది పరిస్థితి. ఏపీకి అప్పులు ఇచ్చిన బ్యాంకులు ప్రస్తుతం వణికిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను పెట్టి మద్యం పన్ను బదలాయించి దాన్ని ఆదాయంగా చూపించి బ్యాంకుల వద్ద అందినంత మేర అప్పులు చేసింది. ఇందులో మధ్యవర్తిత్వంగా ఎస్ బీఐ క్యాప్ సంస్థ రుణాలు ఇప్పించడానికి ప్రభుత్వం నియమించుకుంది. అయితే బ్యాంకులు మాత్రం ప్రభుత్వం తనఖా పెడుతున్న వాటిపై ఎలాంటి పరిశీలనలు లేకుండానే అనుమతులు ఇచ్చేసింది.

ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కరెక్టు కాదని కేంద్రం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని నేరుగా కార్పొరేషన్ కు తరలించడం కూడా రాజ్యాంగ విరుద్ధమే అని చెప్పినా ఏపీ సర్కారు మాత్రం పెడచెవిన పెడుతోంది. ఏది రాజ్యాంగ బద్దమో ఏది రాజ్యాంగ విరుద్దమో కేంద్రానికి వివరణ ఇవ్వాల్సి ఉంది. రాజ్యాంగ నిబంధనలు స్పష్టంగా ఉండడంతో ప్రభుత్వం చేసే కార్యక్రమాలపై విశ్వాసం లేకుండా పోతోంది. కేంద్రం సంతృప్తి చెందకపోతే ఏపీఎస్డీసీని రద్దు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో బ్యాంకులతో చేసుకున్న ఒప్పందాలు చెల్లకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుంది.

మద్యంపై వచ్చిన ఆదాయాన్ని నేరుగా ఏపీఎస్డీసీకకి అక్కడ నుంచి బ్యాంకులకు రీ పేమెంట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ కు మార్చాల్సి ఉంటుంది. దీంతో ఒప్పందంలోని ప్రధానమైన షరతులను ప్రభుత్వం ఉల్లంఘించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు అప్పులు వసూలు చేసుకోవడం కష్టంగా మారుతుంది. దీంతో ప్రభుత్వం ఒకవేళ రద్దయితే ఇక ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే బ్యాంకులు భయపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ ఫ్రభుత్వ తీరుతో బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి బ్యాంకులు విచ్చలవిడిగా అప్పులు ఇవ్వడంపై విమర్శలు సైతం వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం నుంచి అప్పులు వసూలు చేసుకోవడం బ్యాంకులకు సవాలే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎఢా పెడా ఇచ్చేసిన అప్పుల భారంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏదిఏమైనా ఏపీ ప్రభుత్వ తీరుతో బ్యాంకులకు దినదిన గండంగా మారిందని పలువురు చెబుతున్నారు.