Homeఎంటర్టైన్మెంట్పెళ్లిపీటలపై మోసం చేశారు.. వాలెంటైన్స్ డే రోజు సునీత భర్త షాకింగ్ కామెంట్స్..

పెళ్లిపీటలపై మోసం చేశారు.. వాలెంటైన్స్ డే రోజు సునీత భర్త షాకింగ్ కామెంట్స్..

Singer Sunitha
మాఘమాసం ఎప్పుడొస్తుందో.. అంటూ కుర్రకారుకు హుషారెత్తించింది సింగర్ సునీత.. ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో.. అంటూ.. ప్రేమ పక్షులను తన గానంతో ఆకట్టుకుంది ఈ హాట్ సింగర్… సునీత గొంతంటే ఇష్టపడనివారు ఉండరు. సునీత పాటను మెచ్చనివారు దొరకరు. నాలుగు పదుల వయసులోనూ… నవ యవ్వనంగా తన అందంతో ఆకట్టుకునే ప్రముఖ గాయని సునీత ఇటీవలే తన జీవన ప్రయాణంలో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని వివాహం చేసుకున్నారు.

ఆదివారం వాలెంటైన్స్ డే సందర్భంగా యాంకర్ సుమతో ఈ నూతన దంపతులు సరదాకా కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా సునీత భర్త రామ్ వీరపనేని తమ పెళ్లి వేడుకలకు సంబంధించిన విషయాలపై సంచలన కామెంట్ చేశారు. పెళ్లికూతురు.. తన స్నేహితులు పెళ్లిపీటలపై తనను మోసం చేశారని చెప్పుకొచ్చారు.

Also Read: హీరోయిన్ పెళ్లి వార్తలన్నీ రూమర్సే !

ఇటీవలే సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని ఆమె మనువాడారు. తన పెళ్లికి సంబంధించిన వ్యవహారాల తాలూకు సంగతులు.. ఫొటోలు సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అయ్యాయి.సునీత పెళ్లి గురించి పలు రకాల కామెంట్స్ సైతం వినిపించాయి. ఈ నేపథ్యంలో వీరి వివాహ సంగతులు నేటికీ.. చర్చల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఈ నూతన దంపతులు మొదటిసారి ఓ వేదికపై టీవీ ముందుకు వచ్చారు. ఓ చానెల్ లో ముచ్చటించారు. పలు ఆసక్తికర విషయాలను యాంకర్ సుమతో పంచుకున్నారు.

Also Read: క‌లెక్ష‌న్ల‌ ‘ఉప్పెన‌’.. నెంబ‌ర్ 1 హీరోగా వైష్ణ‌వ్..!

ప్రేమికుల రోజు సందర్భంగా రామ్ సునీత జోడీని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది యాంకర్ సుమ. ఈ ఇద్దరికీ.. వ్యక్తిగతంగా కూడా సుమ చాలా సన్నిహితురాలు కావడతో ఈ జోడీ చాలా ఓపెన్ గా ముచ్చటించింది. ఈ క్రమంలో తన పెళ్లి తంతు గురించి రామ్ మాట్లాడుతూ.. ఓ విషయాన్ని చెప్పుకొచ్చారు. పెళ్లిలో బిందెలో ఉంగరాలు వేసి తీసే సమయంలో చాలా చీటింగ్ చేశారని చెప్పారు. ఆడవాళ్లంతా మీదపడి తన చేతిని లాగేశారని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో వారంతా తన చెలికత్తెలని చెబుతూ.. సునీత పంచ్ వేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

19 ఏళ్ల వయసులో సునీత మొదటి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్తతో విబేధాలు వచ్చి విడిపోయింది. తరువాత పిల్లల బాధ్యతను తీసుకుని వారిని పెంచి పెద్దవాళ్లను చేసింది. ఇప్పుడు 43 ఏళ్ల వయసులో వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది సింగర్ సునీత.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper
Exit mobile version